News March 9, 2025
గ్రాడ్యుయేట్ MLC ఓటమిపై కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్

TG: KNR-ADB-NZB-MDK గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటు ఓటమికి గల కారణాలపై వివరణ ఇవ్వాలని పీసీసీ చీఫ్‌ను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశించారు. ‘రాష్ట్రంలో అధికారంలో ఉండి, ఉద్యోగాల భర్తీ, యువత సంక్షేమానికి కృషి చేస్తున్నా ఓడిపోవడం సరికాదు. దీని వల్ల పార్టీపై, ప్రభుత్వంపై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఓటమిపై సమగ్ర రిపోర్ట్ ఇవ్వండి’ అని ఆదేశించినట్లు సమాచారం.
Similar News
News April 1, 2026
రాష్ట్రంలో ‘పారాక్వాట్’పై తాత్కాలిక నిషేధం

TG: అత్యంత ప్రమాదకరమైన ‘పారాక్వాట్’ గడ్డిమందు విక్రయాలు, వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం 60 రోజుల పాటు నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల రైతులు, వ్యవసాయ కూలీలు ప్రాణాలు కోల్పోతుండటంపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. దీనిపై కేంద్రం శాశ్వత నిషేధం విధించాలని అసెంబ్లీ ఇప్పటికే తీర్మానం చేసింది.
News April 1, 2026
‘ఆయా షేర్’.. నాని ఊర మాస్ లుక్!

నేచురల్ స్టార్ నాని తన కొత్త సినిమా ‘ప్యారడైజ్’ కోసం చేసిన మేకోవర్ నెటిజన్లను ఫిదా చేస్తోంది. ఈ చిత్రం కోసం ఆయన కండలు తిరిగేలా బాడీని బిల్డ్ చేశారు. తాజాగా జిమ్‌లో కసరత్తు సందర్భంగా దిగిన ఫొటోను ఆయన షేర్ చేయగా వైరలవుతోంది. నాని మాస్ లుక్ చూసి అభిమానులు ‘ఆయా షేర్’ అని పేర్కొంటూ ఆయన డెడికేషన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ప్యారడైజ్ మూవీ ఆగస్టు 21న విడుదలవనుంది.
News April 1, 2026
కళ్లు అదురుతున్నాయా? 7 కారణాలివే

కళ్లు అదరడం అనారోగ్య సమస్యకు సంకేతమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి/ఆందోళన, అలసట, కెఫిన్/ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం, ఎక్కువ సేపు స్క్రీన్ చూడటం, పోషకాహార లోపం, పొల్యూషన్ వల్ల వచ్చే ఐ అలెర్జీ, మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ వంటి 7 అంశాలు దీనికి కారణాలు కావచ్చని పేర్కొంటున్నారు. కళ్లు అదరడం వారానికి మించి కొనసాగితే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.


