News March 26, 2024
వరుణ్ గాంధీకి కాంగ్రెస్ ఆహ్వానం

బీజేపీ టికెట్ నిరాకరించడంతో భంగపడ్డ వరుణ్ గాంధీని కాంగ్రెస్ ఆహ్వానించింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరీ ప్రకటన చేశారు. ‘వరుణ్ కాంగ్రెస్‌లోకి వస్తే సంతోషిస్తాం. అతను మంచి విద్యావేత్త. పారదర్శకత, గాంధీ కుటుంబంతో సంబంధాలు ఉండటం వల్లే బీజేపీ వరుణ్‌కు సీటు ఇవ్వలేదు’ అని పేర్కొన్నారు. కాగా వరుణ్ తల్లి మేనకా గాంధీ మరోసారి సుల్తాన్‌పుర్ నుంచి బరిలో దిగేందుకు BJP అవకాశం ఇచ్చింది.
Similar News
News March 8, 2026
విశాఖ నుంచి వెళ్లిన 10 వేల కంటైనర్లు వెనక్కి!

AP: US&ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో హార్ముజ్ జలసంధి <<19285220>>మూతబడటం<<>> తెలిసిందే. దీంతో విశాఖ పోర్టు నుంచి సరకులతో వెళ్లిన నౌకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ క్రమంలో వాటిని వెనక్కి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సుమారు 10 వేల కంటైనర్లు వెనక్కి వస్తాయని విశాఖ కంటైనర్ టెర్మినల్ అధికారులు అంచనా వేశారు. వాటిని ఉంచేందుకు స్థలం కేటాయించాలని పోర్టుకు లేఖ రాశారు.
News March 8, 2026
ఈమె ఎదురీత ముందు విధిరాత ఎంత!

పదేళ్లు వీల్‌ఛైర్‌కు పరిమితమైన యువతి సివిల్స్ ఫలితాల్లో 483వ ర్యాంకు సాధించారు. ఆమెనే కేరళకు చెందిన అథిర(30). BDS చదువుతుండగా యాక్సిడెంట్ జరగడంతో తల, వెన్నెముకకు తీవ్ర గాయాలయ్యాయి. ఛాతీ కింది భాగం ప్యారలైజ్ అయిపోయింది. రెండేళ్లు జ్ఞాపకశక్తి కూడా లేదు. ఆ తర్వాత BDS పూర్తి చేశారు. NGOలోని డిసెబిలిటీ వింగ్‌లో పనిచేయడంతో ఆత్మ విశ్వాసం పెరిగిందని, పేరెంట్స్&సిస్టర్ సాయంతో చదివానని అథిర తెలిపారు.
News March 8, 2026
ఇంద్రకీలాద్రిపై మహా కుంభాభిషేకం.. నేడు CBN హాజరు

AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై 12 ఏళ్లకోసారి జరిగే మహా కుంభాభిషేక వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. శుక్రవారం మొదలైన ఈ మూడు రోజుల క్రతువు ఇవాళ్టితో ముగియనుంది. నేడు ప్రధాన ఘట్టం జరగనుంది. ఆలయ విమాన గోపురంపై ఉన్న బంగారు కలశానికి పండితులు మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు. ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలిరానున్నారు. మరోవైపు ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు.


