News March 17, 2024

హైదరాబాద్‌లో బలపడుతున్న కాంగ్రెస్..!

image

HYD, RRలో కాంగ్రెస్ బలపడుతోంది. తాజాగా MLA దానం, MP రంజిత్‌ హస్తం పార్టీలో చేరగా.. మరికొందరు నేతలూ టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం గుర్తు మీద రాజధానిలో ఏ ఒక్కరూ గెలవకపోయినా.. దానం చేరికతో ఒక MLA వచ్చినట్లయింది. ఇది HYD క్యాడర్‌లో జోష్‌ నింపుతోంది. ఇక గులాబీకి కంచుకోటగా ఉన్న మేడ్చల్‌ జిల్లాలోని ఓ MLA పార్టీని వీడను అంటూ‌నే.. INC నేతలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నట్లు టాక్.

Similar News

News April 3, 2025

మేడ్చల్ కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు

image

మేడ్చల్ కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు కలకలం రేపింది. కలెక్టరేట్‌ను పేల్చేస్తామని, కలెక్టర్‌ను చంపేస్తామంటూ ఓ అగంతకుడు మెయిల్ పెట్టారు. ఈ విషయంపై విచారణ జరపాలని కలెక్టర్ గౌతమ్ డీసీపీ పద్మజ రెడ్డికి ఆదేశాలు ఇచ్చారు. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపించారు? అనే అంశంపై విచారణ చేస్తున్నారు. కాగా.. కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు నేపథ్యంలో ఉన్నతాధికారులు అత్యవసర సమావేశమయ్యారు.

News April 3, 2025

అత్తాపూర్‌లో 7 ఏళ్ల బాలుడి హత్య

image

అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి గోల్డెన్ సిటీలో దారుణ ఘటన జరిగింది. 7 ఏళ్ల బాలుడి తలపై రాళ్లతో కొట్టి హత్య చేశారు. అనంతరం డెడ్ బాడీని దుండగులు మీరాలం ట్యాంక్ సమీపంలో పడేశారు. ఈ సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. హత్యకు గురైన బాలుడు ఎవరు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. చుట్టు పక్కన పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ కేసుల వివరాలపై ఆరా తీస్తున్నారు. బాలుడి హత్య వ్యవహారం స్థానికంగా కలకలం రేపింది.

News April 3, 2025

ఎలక్ట్రానిక్ పరికరాల బహిరంగ వేలం

image

రాచకొండ కమిషనరేట్‌ పరిధి అంబర్‌పేటలోని CAR పరేడ్ గ్రౌండ్, హెడ్ క్వార్టర్స్‌లో వస్తువులను బహిరంగ వేలం నిర్వహించాలని రాచకొండ కమిషనరేట్ నిర్ణయించింది. టేబుల్స్, కుర్చీలు, UPS బ్యాటరీలు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, బారికేడ్‌లు, రిఫ్లెక్టివ్ జాకెట్లు, బొల్లార్డ్‌లు మొదలైన వస్తువులను సొంతం చేసుకోవాలనుకున్నవారు. ఈ నెల 4న ఉ.10.30 గంటలకు వేలంలో పాల్గొనవచ్చు. # SHARE IT

error: Content is protected !!