News April 24, 2024
ఖమ్మం సీటుపై కాంగ్రెస్ తీవ్ర కసరత్తు

TG: ఎన్నికలు సమీపిస్తుండటంతో ఖమ్మం అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు ముమ్మరం చేసింది. క్యాండిడేట్ గురించి చర్చించేందుకు జిల్లా మంత్రులు భట్టి, పొంగులేటి బెంగళూరు వెళ్లారు. AICC అధ్యక్షుడు ఖర్గేతో వేర్వేరుగా భేటీ అవ్వనున్నారు. తమ అభిప్రాయాన్ని ఆయనకు వివరించనున్నారు. మరోవైపు ఇప్పటికే రఘురామిరెడ్డి, మండవ వెంకటేశ్వరావు పేర్లు వినిపిస్తుండగా.. తాజాగా రాయల నాగేశ్వరరావు పేరు తెరపైకి వచ్చింది.
Similar News
News April 1, 2026
యూరినేషన్ తర్వాత చుక్కలు పడుతున్నాయా?

యూరినేషన్ పూర్తయ్యాక కాసేపటికి కొన్ని చుక్కలు పడటాన్ని పోస్ట్ మిక్చురిషన్ డ్రిబుల్(PMD) అంటారు. మధ్య వయస్కుల్లో కనిపించే ఈ సమస్య ఇప్పుడు యువకుల్లోనూ పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ప్రోస్టేట్ వాపు, పెల్విక్ ఫ్లోర్ కండరాలు బలహీనపడటం, ఎక్కువగా కూర్చొనే అలవాటుతో ఇది సంభవిస్తుందంటున్నారు. తక్కువస్థాయిలో PMD ప్రమాదకరం కాదని, మూత్రంలో రక్తం, మంట, నొప్పి ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
News April 1, 2026
సెన్సస్: మోదీ సెల్ఫ్ ఎన్యూమరేషన్

దేశవ్యాప్తంగా తొలి దశ జనగణనలో భాగంగా ఇవాళ్టి నుంచి హౌస్ లిస్టింగ్, హౌసింగ్ ఆపరేషన్స్ నమోదు ప్రక్రియ మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ <<19530324>>సెల్ఫ్ ఎన్యూమరేషన్<<>> పూర్తి చేశారు. ఈ ఫొటోలను SMలో పోస్టు చేశారు. ‘సెన్సస్ పూర్తిగా డిజిటల్ విధానంలో జరుగుతుండటం ఇదే తొలిసారి. ఇంటి వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. దేశ ప్రజలంతా ఇందులో భాగం కావాలి’ అని పిలుపునిచ్చారు.
News April 1, 2026
PHOTO GALLERY: పండు వెన్నెల్లో అందాల రామయ్య పెళ్లి

AP: కడప(D) ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ పండు వెన్నెల్లో సీతారాముల కళ్యాణం చూసి వేలాది మంది భక్తులు పులకించిపోయారు. శ్రీరామ నామస్మరణతో ఆలయం ప్రతిధ్వనించింది. అంతకుముందు సీఎం చంద్రబాబు దంపతులు స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కాగా ఈ నెల 5వ తేదీ వరకు ఒంటిమిట్టలో ఉత్సవాలు కొనసాగనున్నాయి.


