News October 13, 2024
కాంగ్రెస్ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తోంది: హరీశ్

TG: PAC ఛైర్మన్, మండలి చీఫ్ విప్ విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఖూనీ చేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ‘మండలి చీఫ్ విప్‌గా మహేందర్ రెడ్డిని ఎలా నియమిస్తారు? ఇది రాజ్యాంగ విరుద్ధం. అనర్హత పిటిషన్ ఛైర్మన్ దగ్గర పెండింగ్‌లో ఉంది. వేటు వేయాల్సిన ఛైర్మనే మహేందర్‌ను చీఫ్ విప్‌గా నియమిస్తూ ఆదేశాలిచ్చారు. దీనిపై సమాధానం ఇవ్వాలి. PAC ఛైర్మన్ విషయంలోనూ ఇలానే చేశారు’ అని ఆయన ధ్వజమెత్తారు.
Similar News
News January 15, 2026
ఎద్దు మోసినంత, గోనె పట్టినంత

పూర్వకాలంలో ధాన్యాన్ని లేదా వస్తువులను కొలవడానికి పెద్ద గోనె సంచులను ఉపయోగించేవారు. ఒక ఎద్దు ఎంత బరువును మోయగలదో, ఒక పెద్ద గోనె సంచిలో ఎంత పరిమాణం పడుతుందో అంత ఎక్కువగా (అంటే చాలా సమృద్ధిగా) ఒకరి దగ్గర ధనం కానీ, వస్తువులు కానీ ఉన్నాయని చెప్పడానికి ఈ సామెతను వాడతారు. ముఖ్యంగా అపారమైన ఐశ్వర్యాన్ని లేదా విపరీతమైన లాభాన్ని సూచించడానికి ఈ సామెతను ఉపయోగిస్తారు.
News January 15, 2026
భారత్ మద్దతు కోరుతున్న ఇరాన్!

ఆందోళనలతో ఇరాన్ అట్టుడుకుతోంది. మరోవైపు యుద్ధం చేస్తామంటూ US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరిస్తున్నారు. ఈ పరిస్థితిలో భారత్ సాయాన్ని ఇరాన్ కోరుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆ దేశ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు ఫోన్ చేశారు. ఈ విషయాన్ని జైశంకర్ స్వయంగా తెలిపారు. అయితే పూర్తి వివరాలను వెల్లడించనప్పటికీ ఆ దేశంలోని పరిస్థితులపై చర్చ జరిగినట్లు పేర్కొన్నారు.
News January 15, 2026
పసిడి మనసుల పండుగ ‘బొమ్మల కొలువు’

సంక్రాంతికి తెలుగు ఇళ్లలో ఆచరించే ముచ్చటైన సంప్రదాయం బొమ్మల కొలువు. ఇంట్లోని దేవతా మూర్తులు, జానపద కళారూపాలు, వృత్తులను ప్రతిబింబించే మట్టి బొమ్మలను మెట్ల ఆకారంలో అమర్చుతారు. ఇది అలంకరణే కాదు. భావితరాలకు మన సంస్కృతి, పురాణ గాథలను పరిచయం చేసే ముఖ్య వేదిక. ఆడపిల్లలు, మహిళలు పేరంటాలకు పిలుచుకుని తాంబూలాలు ఇచ్చుకుంటారు. ఇది కుటుంబ సభ్యుల మధ్య సృజనాత్మకతను, ఆత్మీయతను పెంచే ఒక అందమైన వేడుక.


