News June 4, 2024

గుజరాత్‌లో 4, కర్ణాటకలో 11 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం

image

గుజరాత్‌లో బీజేపీ 22 స్థానాల్లో, కాంగ్రెస్ 4 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. కర్ణాటకలో 15 చోట్ల బీజేపీ, కాంగ్రెస్ 11 స్థానాల్లో, జేడీఎస్ 2 సీట్లలో లీడింగ్‌లో ఉన్నాయి. రాజస్థాన్‌లో బీజేపీ 15, కాంగ్రెస్ 8, ఇతరులు 2 చోట్ల ముందంజలో ఉన్నారు.

Similar News

News February 20, 2026

ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్

image

నేషనల్ హైవేలపై టోల్ ప్లాజాలో క్యాష్ పేమెంట్స్ ఏప్రిల్ 1 నుంచి నిలిచిపోయే అవకాశం ఉందని PIB వెల్లడించింది. అప్పటి నుంచి ఫాస్టాగ్, UPI ద్వారా మాత్రమే చెల్లింపులు ఉంటాయని తెలిపింది. ఇందుకు తగ్గట్లుగా ప్రయాణికులు ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. హైవేలపై అడ్డంకులు లేని ప్రయాణాన్ని కల్పించడం, టెక్నాలజీని పెంపొందించడమే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

News February 20, 2026

ఏకసభ్య కమిషన్ ఛైర్మ‌న్‌గా చంద్రబాబే ఉండాల్సింది.. భూమన ఎద్దేవా

image

AP: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో <<19193937>>ఏకసభ్య కమిషన్<<>> నియామకాన్ని YCP నేత భూమన తప్పుబట్టారు. CBN కోరుకున్నట్లు CBI విచారణ జరగలేదన్నారు. అందుకే రిటైర్డ్ అధికారితో కమిషన్ వేశారని విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయం సుప్రీంకోర్టును అవమానించడమే అని చెప్పారు. CBI సిఫార్సులను ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఏకసభ్య కమిషన్ ఛైర్మ‌న్‌గా చంద్రబాబే ఉంటే సరిపోయేదని ఎద్దేవా చేశారు.

News February 20, 2026

ఇమ్యునిటీని పెంచే ఫ్రూట్స్ ఇవే..

image

చలికాలంలో ఇమ్యునిటీ తగ్గిపోయి త్వరగా రోగాల బారిన పడుతుంటారు. దీనికి చెక్ పెట్టాలంటే కొన్ని ఫ్రూట్స్ డైట్‌లో యాడ్ చేసుకోవాలంటున్నారు నిపుణులు. నారింజ‌, యాపిల్, దానిమ్మ‌, కివి తినడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. వీటితో పాటు శ‌రీరానికి త‌గినంత విట‌మిన్ డి ల‌భించేలా చూసుకోవాలి. అలాగే ఈ కాలంలో వేడినీరు, జావలు, సూప్‌లు తీసుకోవడం కూడా మంచిదని సూచిస్తున్నారు.