News December 29, 2024

కాంగ్రెస్‌వి చీప్ పాలిటిక్స్‌: బీజేపీ

image

మ‌న్మోహ‌న్ స్మార‌కార్థం స్థ‌లాన్ని కేటాయించ‌కుండా ఆయ‌న్ను అవ‌మానించారంటూ కాంగ్రెస్ రాజకీయం చేయడం సిగ్గుచేటని BJP మండిపడింది. అంత్య‌క్రియ‌ల్లో మోదీ, అమిత్ షా కేంద్రంగా మీడియా కవరేజ్ చేశార‌నేది అవాస్త‌వ‌మ‌ని, భ‌ద్ర‌తా సంస్థ‌లు క‌వ‌రేజీపై ఆంక్ష‌లు విధించాయని పేర్కొంది. సరిపడా కుర్చీలు ఏర్పాటు చేయలేదన్న ఆరోపణలను ఖండించింది. ప్రొటోకాల్ ప్రకారం ఫస్ట్ రోలో Ex PM కుటుంబ సభ్యులకు 5 కుర్చీలు కేటాయించారంది.

Similar News

News January 1, 2025

ఇదో లొట్టపీసు కేసు: KTR

image

TG: ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో పస లేదని కేటీఆర్ అన్నారు. ‘ఈ కేసు ఓ లొట్టపీసు కేసు. అవినీతే లేనప్పుడు కేసు ఎక్కడిది? నాపై ఇది ఆరో ప్రయత్నం. రేవంత్ రెడ్డికి ఏమీ దొరకడం లేదు. జడ్జి అడిగే ప్రశ్నలకు ఏజీ దగ్గర సమాధానం లేదు. నాపై కేసు పెడితే రేవంత్ రెడ్డిపై కూడా పెట్టాలి. 7న ఈడీ విచారణకు హాజరుపై మా లాయర్లు నిర్ణయిస్తారు. నాకు న్యాయస్థానాలపై నమ్మకం ఉంది’ అని తెలిపారు.

News January 1, 2025

మేం వచ్చాక అందరికీ భవిష్యత్తుపై భరోసా: సీఎం చంద్రబాబు

image

AP: రాష్ట్రంలో చరిత్ర తిరగరాసిన సంవత్సరం 2024 అని సీఎం చంద్రబాబు చెప్పారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు. ‘గత ఐదేళ్లు ప్రజలు, మీడియా, అధికారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అందరికీ భవిష్యత్తుపై భరోసా వచ్చింది. రాజధాని అమరావతి నగరం ఫ్యూచర్‌లో అభివృద్ధి చెందుతుంది’ అని పేర్కొన్నారు.

News January 1, 2025

న్యూ ఇయర్‌లో ఈ తప్పులు చేయకండి!

image

☛ ఆదాయానికి మించి ఖర్చు చేయవద్దు
☛ ఉన్న అప్పులు తీర్చేందుకు మళ్లీ అప్పులు తీసుకోవద్దు
☛ ఇతరులతో పోల్చుకుంటూ స్థాయికి మించి కార్లు, ఫ్లాట్లు వంటివి కొనుగోలు చేయవద్దు
☛ ఆదాయం పెంచుకునేందుకు, ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి
☛ ఆరోగ్య, జీవిత బీమా తీసుకోవాలి. ఎందుకులే అని నిర్లక్ష్యం చేయవద్దు
☛ ఒక్క ఏడాదిలోనే లక్షాధికారులు అయిపోరనే విషయం గుర్తుంచుకోవాలి. ప్రణాళిక బద్ధంగా పొదుపు, మదుపు చేయాలి.