News September 17, 2024
ఆర్టికల్ 370పై కాంగ్రెస్ సైలెంట్!

ఆర్టికల్ 370 అమలుపై కాంగ్రెస్ సైలెంట్ అయింది. పార్టీ అభ్యర్థులు, నేతలు మాట్లాడుతున్నా జమ్మూకశ్మీర్ ఎన్నికల మ్యానిఫెస్టోలో మాత్రం ప్రస్తావించలేదు. పూర్తిస్థాయి రాష్ట్ర హోదా, ప్రభుత్వ ఉద్యోగాలు, టెండర్లు, భూమి, వనరుల కేటాయింపుల్లో స్థానికులకు ప్రయారిటీ ఇస్తామంది. స్త్రీలకు నెలకు రూ.3000, నిరుద్యోగులకు రూ.3500, రూ.25 లక్షల బీమా, లక్ష ఉద్యోగాల కల్పన, KG ఆపిల్ మద్దతు ధర రూ.72 వంటి హామీలిచ్చింది.
Similar News
News January 17, 2026
బంగ్లాలో మరో హిందువు హత్య.. కారుతో ఢీకొట్టి..

బంగ్లాదేశ్లో హిందువులపై <<18840974>>దారుణాలు<<>> ఆగడం లేదు. రాజ్బరి జిల్లాలో రిపోన్ సాహా(30) అనే వ్యక్తిని కారుతో ఢీకొట్టి చంపేశారు. BNP నేత అబుల్ హషేమ్ కారులో పెట్రోల్ కొట్టించుకుని డబ్బులు ఇవ్వకుండా వెళ్లబోయాడు. అడ్డుకునేందుకు యత్నించిన రిపోన్పైకి కారును ఎక్కించాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు కారును స్వాధీనం చేసుకుని, హషేమ్, కారు డ్రైవర్ కమాల్ హొసైన్ను అరెస్టు చేశారు.
News January 17, 2026
డ్రాగన్ ఫ్రూట్తో మహిళలకు ఎన్నో లాభాలు

కలర్ఫుల్గా కనిపించే డ్రాగన్ ఫ్రూట్లో అనేక పోషకాలుంటాయి. ఇవి మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. మహిళల్లో ఐరన్, ఫోలేట్, విటమిన్ సి లోపాన్ని భర్తీ చేస్తుంది. ముఖ్యంగా మెనోపాజ్ సమయంలో ఆస్టియో పోరోసిస్ ప్రమాదం ఎక్కువ. డ్రాగన్ ఫ్రూట్ను రెగ్యులర్గా తీసుకుంటే మెగ్నీషియం, క్యాల్షియం అంది ఎముకలు బలంగా తయారవుతాయి. అలాగే శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి పెంచుతుందని చెబుతున్నారు.
News January 17, 2026
నవ గ్రహాలు వాటి ప్రత్యధి దేవతలు

ఆదిత్యుడు – రుద్రుడు
చంద్రుడు – గౌరి
అంగారకుడు – క్షేత్రపాలకుడు
బుధుడు – నారాయణుడు
గురు – ఇంద్రుడు
శుక్రుడు – ఇంద్రుడు
శని – ప్రజాపతి
రాహువు – పాము
కేతువు – బ్రహ్మ


