News April 10, 2025
కాంగ్రెస్ రెండో స్వాతంత్ర్య పోరాటం చేస్తోంది: ఖర్గే

అహ్మదాబాద్లో ముగిసిన ఏఐసీసీ సమావేశాల్లో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘ప్రధాని మోదీ ఏదో రోజు దేశాన్ని అమ్మేస్తారు. భారత సంపదను తన మిత్రులకు ధారపోస్తున్నారు. బీజేపీని గద్దె దించేందుకు కాంగ్రెస్ రెండో స్వాతంత్ర్య ఉద్యమాన్ని చేస్తోంది. ఎన్నికల్లోనూ ఈవీఎంల సాయంతో పచ్చిగా మోసాలకు పాల్పడుతోంది. అందుకే 90శాతం సీట్లు గెలిచారు’ అని ఆయన ఆరోపించారు.
Similar News
News April 18, 2025
డేల్ స్టెయిన్ ‘300’ కామెంట్లపై ముంబై సెటైర్!

IPLలో ముంబైతో జరిగే మ్యాచులో SRH 300 స్కోర్ కొడుతుందన్న సౌతాఫ్రికా దిగ్గజ బౌలర్ <<16106276>>డేల్ స్టెయిన్<<>> వ్యాఖ్యలకు ముంబై ఇండియన్స్ కౌంటరిచ్చింది. ‘డేల్ స్టెయిన్ చెప్పినట్లే ఎగ్జాక్ట్గా 328 పరుగులు వచ్చాయి. (రెండు జట్లు కలిపి చేసిన స్కోరు)’ అంటూ Xలో సెటైర్ వేసింది. కాగా SRH 300 ఎప్పుడు కొడుతుందా అన్న నెటిజన్ల చర్చపై గతంలో స్టెయిన్ స్పందించారు. MIతో జరిగే మ్యాచులోనే ఈ ఫీట్ నమోదవుతుందని ఆయన ట్వీట్ చేశారు.
News April 18, 2025
ఉదయాన్నే నోటిని ఆయిల్తో పుక్కిలిస్తే..

ఉదయాన్నే నోటిని ఆయిల్తో పుక్కిలించడం వల్ల దంతాలు శుభ్రపడడంతో పాటు బలోపేతం అవుతాయని, నోటి దుర్వాసన పోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చర్మంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంని, శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపేస్తుందని పేర్కొంటున్నారు. ఆయిల్ పుల్లింగ్ కోసం కొబ్బరి/ నువ్వుల/ సన్ ఫ్లవర్ నూనెను ఉపయోగించవచ్చని.. 15-20min పుక్కిలించి, తర్వాత గోరువెచ్చని నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు.
News April 18, 2025
నేడు జేఈఈ మెయిన్స్ ఫలితాలు?

జేఈఈ మెయిన్స్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA)పై అసంతృప్తితో ఉన్నారు. నిన్న ఫైనల్ కీ విడుదల చేసినట్లు చేసి మళ్లీ తొలగించిన విషయం తెలిసిందే. ఫైనల్ ‘కీ’లో తప్పులున్నాయని పలువురు NTA అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతోనే దాన్ని వెబ్సైట్ నుంచి తీసేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఫలితాలు వెల్లడించే అవకాశం ఉందని NTA వర్గాలు ఢిల్లీలో జాతీయ మీడియాకు చెప్పినట్లు సమాచారం.