News October 30, 2024
కులగణనపై కాంగ్రెస్ కీలక సమావేశం

TG: రాష్ట్రంలో కులగణన సర్వే నేపథ్యంలో గాంధీభవన్లో కాంగ్రెస్ కీలక సమావేశం నిర్వహించింది. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీకి మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు హాజరయ్యారు. కులగణనపై వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాలను నేతలకు మహేశ్ కుమార్ వివరించే అవకాశం ఉంది.
Similar News
News November 23, 2025
కుజ దోషం అంటే ఏంటి?

ఓ వ్యక్తి జాతక చక్రంలో కుజుడు 1, 4, 7, 8, 12 స్థానాల్లో ఉంటే అతనికి కుజ దోషం ఉన్నట్లు పరిగణిస్తారు. జ్యోతిషం ప్రకారం.. ఈ దోషం ఉన్నవారికి బలమైన కోరికలుంటాయి. ఎప్పుడూ అహం, ఆవేశంతో ఊగిపోతారని, వివాహం ఆలస్యంగా అవుతుందని, వైవాహిక జీవితంలో సమస్యలుంటాయని నమ్ముతారు. అయితే వీటన్నింటికీ జ్యోతిష శాస్త్రంలో పరిహారాలున్నాయని పండితులు చెబుతున్నారు.
☞ వాటి గురించి తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.
News November 23, 2025
కుజ దోషం తొలగిపోవాలంటే?

కుజ దోష ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ‘ఓం అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహీ.. తన్నో అంగారక ప్రచోదయాత్’ అనే గాయత్రి మంత్రాన్ని పఠించాలని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసా పఠించాలని చెబుతున్నారు. సమీపంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో మంగళవారం రోజున దాన ధర్మాలు చేయడం, హనుమంతుడిని పూజించడం ఎంతో మంచిదని అంటున్నారు.
News November 23, 2025
కేజీ రూపాయి.. డజను రూ.60!

AP: మూడేళ్లుగా టన్ను <<18336571>>అరటి<<>> రూ.25వేలు పలకగా ఈసారి రూ.1,000లోపు పడిపోవడంతో రాయలసీమ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కేజీకి రూపాయి మాత్రమే వస్తోంది. కిలోకి 6, 7 కాయలు వస్తాయి. 2 కేజీలు అంటే డజను. బయట మార్కెట్లో వ్యాపారులు డజను అరటి రూ.40-60కి అమ్ముతున్నారు. ఈ లెక్కన రైతుకు రూ.2 మాత్రమే వస్తున్నాయంటే వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. లోపం ఎక్కడ ఉంది? COMMENT.


