News September 23, 2024
కాంగ్రెస్ నేతలు నన్ను అభినందిస్తూ మెసేజులు చేస్తున్నారు: KTR

TG: అమృత్ టెండర్లలో CM రేవంత్ రెడ్డి మోసాన్ని బయటపెట్టినందుకు కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు తనను అభినందిస్తూ మెసేజులు చేస్తున్నారని కేటీఆర్ ట్వీట్ చేశారు. కానీ ఈ స్కామ్పై తెలంగాణ బీజేపీ నేతలు మౌనంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఇది బీజేపీ, రేవంత్ మధ్య ఉన్న వింత ప్రేమను బయటపెడుతోందని పేర్కొన్నారు.
Similar News
News January 9, 2026
CMల మాటల్లో ఆంతర్యమేంటి?

నీటి పంపకాల్లో గొడవలతో ప్రయోజనం ఉండదని తెలుగు రాష్ట్రాల CMలు చంద్రబాబు, <<18808939>>రేవంత్<<>> పేర్కొన్నారు. ఒకేరోజు ఇద్దరు CMలు ఇలా మాట్లాడటం సంధికి సంకేతంగా భావించొచ్చు. పైగా <<18809267>>CBN<<>> నల్లమల సాగర్కు నీళ్లు తీసుకెళ్తానని ప్రకటించారు. దీన్ని బట్టి ఇరు రాష్ట్రాలు చర్చలకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. అయితే ఎక్కడ ఎవరు కాంప్రమైజ్ అవుతారు. ఎవరికి ఎంతమేర ప్రయోజనం కలుగుతుంది అన్నదే అసలైన ప్రశ్న.
News January 9, 2026
TET ఫలితాలు విడుదల

AP: రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 2.48 లక్షల మంది ఎగ్జామ్స్ రాయగా 97,560 మంది ఉత్తీర్ణులైనట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులు అధికారిక <
News January 9, 2026
ఇంటర్ కాలేజీలకు సెలవులు ఎప్పుడంటే?

TG: రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీలకు విద్యాశాఖ సంక్రాంతి సెలవులను ఖరారు చేసింది. ఈ నెల 11 నుంచి 18వ తేదీ వరకు సెలవులు ఉంటాయని ప్రకటించింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే ఈ సెలవులు ప్రకటించినట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది. మరోవైపు స్కూళ్లకు ఈనెల 10నుంచి 16వరకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే APలో ఇంటర్ కాలేజీల సెలవులపై ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.


