News June 4, 2024

నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్ ఆధిక్యం

image

TG: నాగర్ కర్నూల్‌లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

Similar News

News November 11, 2025

గట్లు చెక్కే యంత్రంతో కలిగే లాభాలు

image

సాధారణంగా ఇద్దరు మనుషులు రోజంతా కష్టపడితే ఎకరం పొలంలో గట్టు చెక్కగలరు. ఈ యంత్రం సహాయంతో ఒక రోజులో 15 నుంచి 25 ఎకరాల వరకు గట్లు చెక్కవచ్చు. ఈ యంత్రం సాయంతో గంటకు 3-4 ఎకరాల్లో.. దాదాపు 18 ఇంచుల వరకూ గట్లు చెక్కవచ్చంటున్నారు నిపుణులు. ఈ మెషిన్ భాగాలు స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేయడం వల్ల బురదలో నడిచినా తుప్పు పట్టవు. అతి ముఖ్యంగా కూలీల కొరత సమస్యకు ఈ యంత్రం చెక్ పెడుతుంది.

News November 11, 2025

SAతో వన్డే సిరీస్‌కు అయ్యర్ దూరం?

image

నవంబర్ 30 నుంచి ప్రారంభంకానున్న SA ODI సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. ‘అతను పూర్తిగా కోలుకుని సెలక్షన్‌కు అందుబాటులోకి రావడానికి సమయం పడుతుంది. గాయమైనప్పుడు 10 నిమిషాలు అయ్యర్ ఆక్సిజన్ లెవల్స్ 50కి పడిపోయాయి. కంప్లీట్ బ్లాకౌట్ అయ్యాడు’ అని BCCI సోర్సెస్ చెప్పినట్లు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పేర్కొంది. అతనికి కాస్త విశ్రాంతి ఇవ్వాలని బోర్డు భావిస్తున్నట్లు తెలిపింది.

News November 11, 2025

జూబ్లీహిల్స్ పోలింగ్ అప్‌డేట్స్

image

✦ మ.3 గంటల వరకు 40.20% ఓటింగ్ నమోదు.. సా.6 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్
✦ కాంగ్రెస్ నేతలు నగదు పంచుతూ ఓటర్లను భయపెడుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు. రౌడీయిజం చేస్తున్న వారి సంగతి 14వ తేదీన చెప్తా: మాగంటి సునీత
✦ ప్రజాస్వామ్యం పట్ల గౌరవాన్ని ఆచరించేది కాంగ్రెస్.. ఓడిపోతున్నామని అసహనంతో BRS అభ్యర్థి మూడు రోజులుగా ఏది పడితే అది మాట్లాడుతున్నారు: మంత్రి పొన్నం