News April 6, 2024
కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్ చేసిన రాహుల్

TG: కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోను ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విడుదల చేశారు. తుక్కుగూడలో జరుగుతున్న జనజాతర సభలో మేనిఫెస్టో తెలుగు ప్రతిని రిలీజ్ చేశారు. తెలంగాణకు ప్రత్యేకంగా 23 హామీలను కాంగ్రెస్ ప్రకటించనుంది.
Similar News
News October 30, 2025
కూతురు మృతి: అడుగడుగునా లంచం ఇవ్వలేక..

ఒక్కగానొక్క కూతురు(34) అనారోగ్యంతో చనిపోతే.. ఆ తర్వాత అడుగడుగునా లంచం ఇవ్వలేక ఆ తండ్రి కుంగిపోయారు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. BPCL మాజీ CFO శివకుమార్ కూతురు ఇటీవల మరణించారు. అయితే అంబులెన్స్ మొదలుకుని FIR, పోస్టుమార్టం రిపోర్టు, అంత్యక్రియలు, డెత్ సర్టిఫికెట్ వరకు లంచం ఇవ్వాల్సి వచ్చిందని అతను SMలో పోస్టు చేసి ఆ తర్వాత డిలీట్ చేశారు. సిస్టమ్‌లోని కరప్షన్‌పై నెటిజన్లు ఫైరవుతున్నారు.
News October 30, 2025
ఈ డివైజ్‌తో అందమైన పాదాలు మీ సొంతం

పాదాల సంరక్షణ కోసం వచ్చిందే ఈ ఎలక్ట్రిక్ కాలస్ రిమూవర్. ఈ మల్టీఫంక్షనల్ పెడిక్యూర్ కిట్‌లో డెడ్ స్కిన్ రిమూవల్ హెడ్‌తో పాటు, నెయిల్ బఫర్ హెడ్, పాలిషింగ్ హెడ్ వస్తాయి. దీనికి ముందువైపు పవర్ బటన్ ఉంటుంది. స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ డివైస్‌తో పెడిక్యూర్ చేసుకోవడం చాలా సులభం. ఇది మృతకణాలను తొలగించి పాదాలను మృదువుగా మార్చడమే కాకుండా బ్యాక్టీరియా పెరుగుదలనూ నిరోధిస్తుంది.
News October 30, 2025
12NHలపై EV ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం

TG: రాష్ట్రంలోని 12 నేషనల్ హైవేస్‌పై ఎలక్ట్రిక్ వెహికల్ (EV) పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు రానున్నాయి. PM e-డ్రైవ్ పథకం కింద NHA 13 రూట్లలోని ప్రాంతాలను ప్రతిపాదించగా కేంద్రం 12 స్టేషన్లను ఆమోదించింది. NH44(ఆదిలాబాద్-మహబూబ్ నగర్), NH65 (జహీరాబాద్-కోదాడ), NH163 (వికారాబాద్-ములుగు), NH765 (హైదరాబాద్-దిండి) ఇందులో ఉన్నాయి. NH150 (సంగారెడ్డి)ని మినహాయించారు. స్టేషన్లు ఏర్పాటుపై రాయితీలు ఇస్తారు.


