News April 10, 2024
ఈ నెల 21న భువనగిరిలో కాంగ్రెస్ సభ

TG: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 21న భువనగిరిలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్ రెడ్డి ఆ రోజున నామినేషన్ దాఖలు చేయనుండగా.. అదేరోజు జరిగే సభలో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. అటు మే తొలి వారంలో నిర్వహించే సభకు ప్రియాంకా గాంధీని ఆహ్వానించాలని హస్తం నేతలు డిసైడ్ అయ్యారు.
Similar News
News March 27, 2026
NLG: వేసవిలో విద్యుత్ కష్టాలకు చెక్.. ‘పవర్’ ఫుల్ ప్లాన్

వేసవిలో ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కలగకుండా నల్గొండ జిల్లా అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారు. సాధారణంగా రోజుకు 15 మిలియన్ యూనిట్ల వాడకం ఉండగా, ఏప్రిల్, మే నెలల్లో ఇది 22 మిలియన్ యూనిట్లకు చేరుతుందని అంచనా. లోడ్ తట్టుకునేందుకు సబ్‌స్టేషన్లలో అదనపు ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే నల్గొండ, మిర్యాలగూడ, దేవరకొండ ప్రాంతాల్లో సామర్థ్యాన్ని పెంచారు.
News March 27, 2026
42వేల టన్నుల LPG.. మరో నౌక వచ్చేసింది

హార్ముజ్ జలసంధిని దాటుకొని మరో నౌక భారత్‌కు చేరుకుంది. కాసేపటి క్రితం గుజరాత్‌లోని కాండ్లా పోర్టుకు చేరుకున్న ‘జగ్ వసంత్’ షిప్పులో 42వేల టన్నుల లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) ఉంది. మరోవైపు 45వేల టన్నుల LPGతో ‘పైన్ గ్యాస్’ అనే నౌక సైతం ఇవాళ లేదా రేపు ఇండియాకు చేరనుంది. హార్ముజ్ దాటాక భారత నేవీ ఈ షిప్పులకు ఎస్కార్ట్ కల్పించింది.
News March 27, 2026
NCLలో 12 ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు

నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ (NCL), పుణె.. కాంట్రాక్ట్ పద్ధతిలో 12 ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులను భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. BE/B.Tech/MScతో పాటు ఉద్యోగ అనుభవం ఉన్నవారు అప్లై చేయవచ్చు. ఇంటర్వ్యూ చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌లో అప్లై చేయడానికి 31.03.26 లాస్ట్ డేట్. ఇంటర్వ్యూ తేదీ 09.04.26. మరిన్ని వివరాల కోసం www.ncl-india.org చూడండి.


