News September 7, 2025
ఈ నెల 15న కామారెడ్డిలో కాంగ్రెస్ సభ!

TG: ఈ నెల 15న కామారెడ్డిలో BC డిక్లరేషన్ విజయోత్సవ సభ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. BCలకు 42% శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు తీసుకుంటున్న చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని యోచిస్తోంది. ఈ సభకు ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు పలువురు నేతలకు ఆహ్వానం పంపనున్నట్లు సమాచారం. మరోవైపు రేపు HYDలో జరిగే PCC విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై చర్చించనున్నారు.
Similar News
News September 7, 2025
నుదుటిన బొట్టు ఎందుకు పెట్టుకోవాలి?

బొట్టు పెట్టుకోవడం అలంకరణలో భాగం మాత్రమే కాదని, దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయని పలు శాస్త్రాలు చెబుతున్నాయి. ‘అజ్ఞా చక్రంపై బొట్టు పెట్టుకుంటే శాంతి, శక్తి, ఏకాగ్రత లభిస్తాయి. లక్ష్మీదేవికి ప్రతీకైన తిలకాన్ని ధరిస్తే.. ఆమెను ఇంట్లోకి ఆహ్వానించిట్లే’ అని పురాణాలు సూచిస్తున్నాయి. యోగ శాస్త్రం ప్రకారం.. 3 నాడీ వ్యవస్థలు ఒకేచోట కలిసే నుదుటిపై బొట్టు పెట్టుకుంటే సోమరితనం తగ్గి, ఓపిక పెరుగుతుందని ప్రతీతి.
News September 7, 2025
వాలంటీర్ల పనులు మాతో ఎందుకు.. సచివాలయ ఉద్యోగుల నిరసన

AP: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు పోరాటానికి దిగారు. వాలంటీర్ల విధులను చేయాలని ప్రభుత్వం ఆదేశించడాన్ని నిరసిస్తున్నామని జేఏసీ తెలిపింది. నిన్న నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కాగా వైసీపీ హయాంలో 50 ఇళ్లకు ఓ వాలంటీర్ ఉండగా.. కూటమి సర్కార్ ఆ వ్యవస్థను పక్కనబెట్టింది. ఇప్పుడు నాలుగైదు క్లస్టర్లకు ఓ సచివాలయ ఉద్యోగికి కేటాయించి పనులు చేయాలని సూచించింది. తమపై ఒత్తిడి పెరుగుతోందని వాపోతున్నారు.
News September 7, 2025
మహిళలూ.. జింక్ తగ్గిందా..?

మహిళల ఆరోగ్యానికి జింక్ ఎంతో అవసరం. జింక్ ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ ఉత్పత్తిని పెంచుతుంది. గర్భాశయానికి రక్తప్రసరణ పెంచి, నెలసరిలో వచ్చే నొప్పుల్ని తగ్గిస్తుంది. గాయాలు, వాపులు, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. తెల్లరక్తకణాలను ఉత్పత్తి చేస్తుంది. చర్మ కణాల పునరుద్ధరణకు సాయపడుతుంది. పునరుత్పత్తి సామర్థ్యాన్నీ పెంచుతుంది. జింక్ కోసం చిక్కుళ్లు, శనగలు, గుమ్మడి, పుచ్చగింజలు, డ్రైఫ్రూట్స్ తీసుకోవాలి.