News August 23, 2025

బెట్టింగ్ కేసులో కాంగ్రెస్ MLA అరెస్ట్

image

బెట్టింగ్‌ కేసులో కర్ణాటక(చిత్రదుర్గ) కాంగ్రెస్ MLA వీరేంద్ర‌ను ED అరెస్ట్ చేసింది. ఈయన సిక్కింలోని గ్యాంగ్‌టక్‌లో క్యాసినో నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. రూ.12కోట్ల నగదు, రూ.6కోట్ల బంగారు ఆభరణాలు సీజ్ చేశారు. ఈయన సోదరుడు, సన్నిహితులు బెట్టింగ్ యాప్‌లు నిర్వహిస్తున్నట్లు గుర్తించి వారి బ్యాంక్ ఖాతాలు సీజ్ చేశారు. ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ అమల్లోకి వచ్చిన కొద్దిగంటల్లోనే అరెస్ట్ చేయడం గమనార్హం.

Similar News

News August 23, 2025

వచ్చే నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలు!

image

TG: వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని CM రేవంత్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇవాళ జరిగిన PAC భేటీలో మెజార్టీ సభ్యులు ఎన్నికలకు వెళ్దామనే అభిప్రాయం వ్యక్తం చేయగా, CM వారి సూచనలతో ఏకీభవించినట్లు తెలుస్తోంది. అత్యవసర పరిస్థితులు ఎదురైతే కోర్టును కోరాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీపరంగా BCలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని PAC భేటీలో నిర్ణయించిన విషయం తెలిసిందే.

News August 23, 2025

ఇంటర్ కాలేజీల్లో అమలులోకి ఫేషియల్ రికగ్నిషన్

image

TG: 430 ఇంటర్ కాలేజీల్లో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ అమలులోకి వచ్చింది. 1,64,621 మంది విద్యార్థుల్లో ఇప్పటికే 63,587 మంది రిజిస్ట్రేషన్ పూర్తైంది. మిగిలిన వారి రిజిస్ట్రేషన్ సోమవారం కల్లా పూర్తవుతుందని అధికారులు తెలిపారు. వాట్సాప్ ద్వారా పేరెంట్స్‌కు హాజరు, రిపోర్ట్స్‌పై రియల్ టైమ్ అప్‌డేట్స్ ఇవ్వనున్నారు. ఈ విధానంతో అటెండెన్స్ మానిటరింగ్, ప్రాక్సీ అటెండెన్స్‌కు చెక్ వంటి లాభాలుంటాయని తెలిపారు.

News August 23, 2025

ట్రంప్‌లాంటి అధ్యక్షుడిని చూడలేదు: జైశంకర్

image

వాణిజ్యంతో సంబంధంలేని విషయాలకూ ట్రంప్ టారిఫ్స్‌ని ఉపయోగిస్తున్నారంటూ విదేశాంగ మంత్రి జైశంకర్ వ్యాఖ్యానించారు. ‘ట్రంప్ తరహాలో విదేశాంగ విధానాలను ఇంత బహిరంగంగా నిర్వహించిన ఏ US ప్రెసిడెంట్‌ని గతంలో చూడలేదు. కేవలం ఇండియాతోనే కాదు.. ఎన్నో దేశాలతో ఆయన వ్యవహరిస్తున్న తీరు సంప్రదాయ పద్ధతులకు సుదూరంగా ఉంది. వాణిజ్యేతర అంశాలకు కూడా టారిఫ్స్‌ని ఉపయోగించడం కొంచెం కొత్తగా ఉంది’ అని తెలిపారు.