News February 3, 2025
తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్

TG: ఎమ్మెల్సీ నవీన్ కుమార్(<<15344708>>తీన్మార్ మల్లన్న<<>>)పై భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఫైరయ్యారు. మల్లన్న స్థాయి మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. డబ్బులు ఖర్చు పెట్టి నల్గొండలో ఆయనను గెలిపించినట్లు తెలిపారు. ఓ వర్గాన్ని టార్గెట్ చేసి ఆయన మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పార్టీ ఆయనపై చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
Similar News
News April 10, 2026
CRPFలో 9,175 ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల

CRPFలో 9,175 కానిస్టేబుల్(మెన్స్-9,096, ఉమెన్స్-79) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీలో 504, టీజీలో 356 పోస్టులున్నాయి. టెక్నికల్, ట్రేడ్స్‌మెన్, పయనీర్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తారు. ఈ నెల 20 నుంచి మే 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, సంబంధిత విభాగంలో ITI పాసైన వారు అర్హులు. వయసు 18-23 ఏళ్లు ఉండాలి. వెబ్‌సైట్: https://www.rect.crpf.gov.in
News April 10, 2026
రానున్న 3 గంటల్లో వర్షాలు: APSDMA

AP: రానున్న 3 గంటల్లో రాష్ట్రంలోని విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA అంచనా వేసింది. ఆ సమయంలో గంటకు 40-50 కి.మీ. వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని చెప్పింది. పిడుగులు పడే ఆస్కారమున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడరాదని పేర్కొంది.
News April 10, 2026
వెజైనల్ ఇన్ఫెక్షన్స్‌తో సంతాన సమస్యలు

మహిళల్లో వైట్ డిశ్చార్జ్ రంగు మారినా, వెజైనా పొడిబారి మంట, దురద వస్తూ స్పాటింగ్ కనిపిస్తున్నా వెజైనల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లే. అయితే కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అవుతాయి. దాంతో పిండం గర్భాశయంలోకి వెళ్లదు. దాన్నే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. దీన్ని గుర్తించకపోతే ఫెలోపియన్ ట్యూబ్స్ పగిలి ప్రాణాలకే ప్రమాదం. కాబట్టి ఏవైనా ఇన్ఫెక్షన్లు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.


