News April 6, 2024
కాంగ్రెస్ ఎమ్మెల్యే భార్య పాకిస్థానీ.. BJP MLA వివాదాస్పద వ్యాఖ్యలు
కర్ణాటక BJP MLA బసనగౌడ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామేశ్వరం కేఫ్ బాంబ్ బ్లాస్ట్ కేసులో BJP కార్యకర్త <<12995195>>అరెస్టవడంపై<<>> ప్రశ్నించిన INC MLA దినేశ్ గుండురావ్పై మండిపడ్డారు. ‘దినేశ్ ముస్లిం మహిళ తబస్సుమ్ను పెళ్లాడారు. అతని ఇంట్లో సగం పాకిస్థాన్ ఉంది’ అని హేయంగా మాట్లాడారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. ‘నేను ముస్లింనే. కానీ నా భారతీయతను ఎవరూ ప్రశ్నించలేరు. ఆయన వ్యాఖ్యలు అవమానకరం’ అని ఫైరయ్యారు.
Similar News
News December 21, 2024
RGV ‘వ్యూహం’ మూవీకి నోటీసులు
డైరెక్టర్ ఆర్జీవీ తెరకెక్కించిన ‘వ్యూహం’ మూవీకి AP ఫైబర్ గ్రిడ్ లీగల్ నోటీసులు పంపింది. ఫైబర్ నెట్లో వ్యూస్ లేకున్నా రూ.1.15 కోట్లు లబ్ధి పొందడంతో RGVతోపాటు మరో ఐదుగురికి కూడా సమన్లు జారీ చేసింది. 15 రోజుల్లోగా వడ్డీతో సహా తీసుకున్న డబ్బును వెనక్కి కట్టాలని ఆదేశించింది. కాగా ఫైబర్ నెట్లో వ్యూహం సినిమాకు 1,816 వ్యూస్ రాగా అప్పటి ప్రభుత్వం రూ.1.15 కోట్లు చెల్లించిందని ఫైబర్ గ్రిడ్ ఆరోపించింది.
News December 21, 2024
ప్రధానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి: పవన్ కళ్యాణ్
AP: తాను కేవలం ఒక రోడ్డు వేయించి వెళ్లిపోనని, 5ఏళ్లు పని చేస్తానని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. అల్లూరి జిల్లా అనంతగిరి (D) బల్లగరువులో పర్యటించిన ఆయన 100 కి.మీ. మేర 120 రోడ్లకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఇంతకు ముందు 250 మంది ఉంటే కానీ రోడ్లు పడేవి కాదని, కానీ 100 మంది ఉన్నా రోడ్డు వేయాలని PM మోదీ చెప్పడంతో ఈ రోడ్ల నిర్మాణం జరుగుతోందన్నారు. అందుకు ప్రధానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలని తెలిపారు.
News December 21, 2024
మరికొన్ని గంటల్లో అద్భుతం
ఈరోజు ఆకాశంలో అద్భుతం జరగనుంది. ఎప్పటిలా కాకుండా ఈరోజు ముందుగానే రాత్రి కానుంది. భూభ్రమణంలో భాగంగా సూర్యుడి చుట్టూ భూమి తిరిగే కక్ష్య దూరం పెరిగి 16గంటల సుదీర్ఘ రాత్రి ఉండనుంది. ఈరోజు ఉదయం 7.10గంటలకు సూర్యుడు ఉదయించగా సూర్యకాంతి దాదాపు 8 గంటలే ఉండనుంది. ఇలా సుదీర్ఘ రాత్రి ఏర్పడే రోజు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.