News January 30, 2025

రేప్ కేసులో కాంగ్రెస్ ఎంపీ అరెస్ట్

image

అత్యాచారం కేసులో UPలోని సీతాపూర్ కాంగ్రెస్ MP రాకేశ్ రాథోడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి నాలుగేళ్లుగా రాకేశ్ తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆయనపై ఈనెల 17న కేసు నమోదు చేశారు. రాకేశ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను అలహాబాద్ HC నిన్న కొట్టేసింది. కేసు సెటిల్‌ చేసుకుందామని రాకేశ్ ఒత్తిడి చేస్తున్నారని బాధితురాలి భర్త ఆరోపించారు.

Similar News

News October 16, 2025

బోగస్ ఓట్లపై ఈసీకి ఆదేశాలు ఇవ్వలేం: HC

image

TG: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బోగస్ ఓట్లపై కేటీఆర్, మాగంటి సునీత దాఖలు చేసిన పిటిషన్లపై విచారణలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సమయంలో ఈసీకి ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఎన్నికల సంఘం ఎలక్టోరల్స్‌ను రివిజన్ చేస్తోందని, ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని చెబుతూ విచారణను ముగించింది.

News October 16, 2025

లోకేశ్ కౌంటర్ కర్ణాటక ఐటీ మంత్రికేనా?

image

గూగుల్ కంపెనీకి ఏపీ ప్రభుత్వం రూ.22వేల కోట్ల రాయితీలు ఇస్తోందని, అందుకే ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిందని కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే నిన్న వ్యాఖ్యానించారు. అలాంటి రాయితీలు తాము ఇస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారని పలువురు విమర్శిస్తారని చెప్పారు. ఈ కామెంట్లకే ఏపీ మంత్రి లోకేశ్ <<18020050>>కౌంటర్<<>> ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆంధ్రా పెట్టుబడులు సెగ పొరుగువారికి తగులుతోందని ట్వీట్ చేశారు.

News October 16, 2025

మేం కులసర్వేలో పాల్గొనం: నారాయణమూర్తి దంపతులు

image

కర్ణాటక ప్రభుత్వ కుల, విద్య, ఆర్థిక సర్వేలో పాల్గొనేందుకు ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి, అతని భార్య సుధా మూర్తి నిరాకరించారు. ‘మేం వెనుకబడిన తరగతికి చెందినవాళ్లం కాదు. ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ముందున్నాం. మా సమాచారాన్ని పొందడం వల్ల ప్రభుత్వానికి లేదా OBCలకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈ సర్వే ప్రాథమిక ఉద్దేశం BCలను గుర్తించి, వారికి సౌకర్యాలు కల్పించడం’ అని డిక్లరేషన్ ఫాం ఇచ్చారని సమాచారం.