News August 26, 2024
కాంగ్రెస్ ఎంపీ కన్నుమూత

మహారాష్ట్రలోని నాందేడ్ ఎంపీ, కాంగ్రెస్ నేత వసంత్ బల్వంత్‌రావు చవాన్(70) కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఇవాళ తెల్లవారుజామున మరణించారు. ఆయన 2009లో తొలిసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి నైగావ్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో అదే స్థానంలో కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు.
Similar News
News October 31, 2025
ఈ పెయింటింగ్ ఖరీదు.. రూ.120 కోట్లు

మొఘల్(16వ శతాబ్దం) కాలంలో బస్వాన్ అనే చిత్రకారుడు వేసిన ఓ పెయింటింగ్ రూ.120 కోట్లకు(13.6 మిలియన్ డాలర్లు) అమ్ముడుపోయింది. కొండలు, పచ్చిక బయళ్ల మధ్య చీతా ఫ్యామిలీ సేద తీరుతున్నట్లుగా ఉండే ఈ చిత్రాన్ని 29.8CM ఎత్తు, 18.6CM వెడల్పు ఫ్రేమ్‌పై గీశారు. తాజాగా ఆ పెయింటింగ్ లండన్‌లో జరిగిన క్రిస్టీ వేలంలోకి వచ్చింది. అంచనాకు మించి సుమారు 14 రెట్ల అధిక ధర పలికింది.
News October 31, 2025
ఘనంగా అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్

హీరో అల్లు శిరీష్-నయనిక ఎంగేజ్మెంట్ ఇవాళ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాల సభ్యులు, స్నేహితుల సమక్షంలో వారిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్ తదితరులు హాజరయ్యారు. పెళ్లి తేదీపై త్వరలో ప్రకటన రానుంది.
News October 31, 2025
ఆ హక్కు బీఆర్ఎస్కు లేదు: రేవంత్

TG: బీఆర్ఎస్, బీజేపీది ఫెవికాల్ బంధమని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ‘సంప్రదాయాన్ని తుంగలో తొక్కింది బీఆర్ఎస్సే. గతంలో పీజేఆర్ చనిపోతే దుర్మార్గంగా తమ అభ్యర్థిని నిలబెట్టింది. ఇప్పుడు ఆ పార్టీకి సానుభూతి ఓట్లు అడిగే హక్కు లేదు’ అని మండిపడ్డారు. ఓట్లు అడిగేందుకు బీఆర్ఎస్ నేతలు వస్తే వాతలు పెట్టాలని అన్నారు.


