News August 20, 2025
రాజ్యాంగ సవరణ బిల్లుకు కాంగ్రెస్ MP శశిథరూర్ మద్దతు

నేరం చేస్తే పీఎం, సీఎం, మంత్రులకు ఉద్వాసన పలికేలా కేంద్రం రూపొందించిన బిల్లుకు ప్రతిపక్ష ఎంపీ శశి థరూర్ మద్దతు పలికారు. ఆ బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టగా విపక్షాలు వ్యతిరేకత వ్యక్తం చేశాయి. ప్రతిపక్ష సీఎంలను అన్యాయంగా అరెస్టు చేస్తే పరిస్థితి ఏంటని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక ప్రశ్నించారు. అయితే అందుకు భిన్నంగా శశి థరూర్ స్పందిస్తూ ఆ బిల్లుల్లో లోపమేమీ లేదని అభిప్రాయపడ్డారు.
Similar News
News March 28, 2026
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేడు ‘లోక్ అదాలత్’

ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ఉన్న అన్నీ కోర్టులలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. రాజీ పడదగ్గ సివిల్, క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్, మోటారు వాహన ప్రమాద బీమా, బ్యాంకు రికవరీ కేసులను ఇరువర్గాల అంగీకారంతో త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని న్యాయమూర్తులు తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకొని కోర్టుల చుట్టూ తిరిగే శ్రమను, ఖర్చులు తగ్గించుకోవాలని కోరారు.
News March 28, 2026
విశాఖలో గూగుల్ డేటా సెంటర్.. ఏప్రిల్‌లో భూమి పూజ?

AP: విశాఖలో గూగుల్ మెగా డేటా సెంటర్ ఏర్పాటుకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. నిర్మాణ అనుమతుల కోసం బిల్డింగ్ ప్లాన్‌ను సంస్థ ప్రభుత్వానికి సమర్పించింది. పర్యావరణానికి నష్టం లేకుండా చెరువులు, నీటి కుంటలను యథాతథంగా ఉంచుతూ అభివృద్ధి చేస్తామని తెలిపింది. అనుమతులు రాగానే ఏప్రిల్‌లో భూమి పూజ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో 601 ఎకరాలను కేటాయించింది.
News March 28, 2026
అనిరుధ్‌తో కావ్యా మారన్ పెళ్లి?

సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్యా మారన్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత కొన్నేళ్లుగా వారు డేటింగ్‌లో ఉన్నట్లు ఎప్పటి నుంచో రూమర్స్ ఉన్నాయి. వారిద్దరూ కలిసి కనిపించడం, SRHకు సాంగ్ కంపోజ్ చేయడం దీనికి బలాన్ని చేకూర్చాయి. అనిరుధ్ గతంలో ఆ వార్తలను ఖండించినప్పటికీ వీరిద్దరి పెళ్లి ఫిక్స్ అయిందంటూ తాజాగా తమిళ మీడియా పేర్కొంటోంది.


