News March 27, 2024

కాంగ్రెస్ ఎంపీ టికెట్లు.. రేసులో ఉంది వీరేనా?

image

తెలంగాణలో 8 ఎంపీ సీట్లకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈరోజు సాయంత్రం కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ దీనిపై భేటీ కానుంది.
*కరీంనగర్- ప్రవీణ్ రెడ్డి/తీన్మార్ మల్లన్న
*ఖమ్మం- నందిని (భట్టి విక్రమార్క సతీమణి)
*భువనగిరి- కోమటిరెడ్డి లక్ష్మి/చామల కిరణ్
*వరంగల్- దొమ్మాటి సాంబయ్య/డాక్టర్ పరమేశ్వర్
*నిజామాబాద్- టి.జీవన్ రెడ్డి
*మెదక్- నీలం మధు

Similar News

News April 10, 2026

వాట్సాప్ మెసేజ్‌లను చదివేస్తున్నారంటూ USలో పిటిషన్!

image

వాట్సాప్ తన యూజర్లను మోసం చేసిందంటూ USలో పిటిషన్ దాఖలైంది. ‘ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో మెసేజ్‌లు సేఫ్ అని మెటా చెప్పింది. కానీ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కంపెనీలకు ప్రైవేట్ చాట్స్ చదివేందుకు, స్టోర్ చేసేందుకు అనుమతినిచ్చింది’ అని పిటిషనర్ చెబుతున్నారు. యూజర్ల నమ్మకాన్ని జుకర్‌బర్గ్ వమ్ము చేశారని, మెసేజ్‌లు సేఫ్ కాదని ఆరోపిస్తున్నారు. దీనిపై ఎలాన్ మస్క్, Paytm ఫౌండర్ విజయ్ ఆందోళన వ్యక్తం చేశారు.

News April 10, 2026

మొజ్తబా సంచలన ప్రకటన

image

హార్ముజ్ జలసంధిపై ఎవరి నియంత్రణా ఉండొద్దని ట్రంప్ చెబుతున్న వేళ ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా సంచలన ప్రకటన చేశారు. ఆ జలసంధి నిర్వహణను మరో దశకు తీసుకెళ్తామన్నారు. తమపై దాడి చేసిన వారిని వదిలేది లేదని స్పష్టం చేశారు. తన తండ్రి అయతుల్లా ఖమేనీ మరణానికి, అమరవీరుల త్యాగాలకు ప్రతీకారం తీర్చుకుంటామని తెలిపారు. యుద్ధంతో జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

News April 10, 2026

ఆ బాధతో రోజూ ఫుల్ బాటిల్ తాగేవాడిని: ఆమిర్

image

తనను ఒంటరిగా వదిలి మొదటి భార్య రీనా దత్తా ఇద్దరు పిల్లలతో ఇంటి నుంచి వెళ్లిపోయినప్పుడు తీవ్రంగా కుంగిపోయానని ఆమిర్ ఖాన్ తెలిపారు. ఎమోషన్లను అదుపు చేసుకోలేక ఏడాదికిపైగా రోజూ ఒక ఫుల్ బాటిల్ మద్యం తాగేవాడినని ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. ఈ ఘటనకు ముందు తనకు లిక్కర్ అలవాటు లేదన్నారు. రీనాతో 2002లో, కిరణ్ రావుతో 2021లో ఆమిర్ డివోర్స్ తీసుకొన్నారు. ప్రస్తుతం గౌరీతో రిలేషన్‌లో ఉన్నారు.