News August 18, 2025

యూరియా కోసం కాంగ్రెస్ MPల నిరసన

image

TG: రాష్ట్రంలో యూరియా కొరత నేపథ్యంలో ఢిల్లీలోని పార్లమెంటు భవనం ఎదుట రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు నిరసన చేపట్టారు. తెలంగాణకు రావాల్సిన యూరియాను వెంటనే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈమేరకు కేంద్రమంత్రి నడ్డాను కలిసి రాష్ట్రానికి సరిపడా యూరియా కేటాయించాలని వారు కోరనున్నారు. యూరియాపై జీరో అవర్‌లో ప్రస్తావించాలని ఎంపీలు నిర్ణయించారు.

Similar News

News August 18, 2025

కేంద్రమంత్రులతో నారా లోకేశ్ భేటీ

image

AP: ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేశ్ కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. కానూరు-మచిలీపట్నం 6 లైన్ల రోడ్డు విస్తరణకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని గడ్కరీని కోరారు. అటు రాష్ట్రంలో చేపట్టబోయే కొత్త ప్రాజెక్టులకు సహకారం అందించాలని నిర్మలకు విజ్ఞప్తి చేశారు. అంతకుముందు టీడీపీ పార్లమెంట్ కార్యాలయానికి వెళ్లిన లోకేశ్‌ను TDP, JSP ఎంపీలు ఘనంగా సత్కరించారు.

News August 18, 2025

భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

image

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాల్లో ట్రేడయ్యాయి. నిఫ్టీ 25 వేల మార్క్‌కు కొద్ది దూరంలో ఆగిపోయింది. సెన్సెక్స్ 676 పాయింట్ల లాభంతో 81,273, నిఫ్టీ 251 పాయింట్లు ఎగిసి 24,882 వద్ద ముగిశాయి. GST సంస్కరణలపై PM ప్రకటన మదుపర్లపై సానుకూల ప్రభావం చూపింది. మారుతీ సుజుకీ, హీరో మోటోకార్ప్, నెస్లే, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో టాప్ గెయినర్స్. ITC, ఎటర్నల్, టెక్ మహీంద్రా, L&T, NTPC టాప్ లూజర్స్.

News August 18, 2025

తిరుమలకు ఫ్రీ బస్సు సౌకర్యం అందుకే పెట్టలేదు: మంత్రి

image

తిరుపతి నుంచి <<17428145>>తిరుమలకు<<>> వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో ‘స్త్రీ శక్తి’ పథకాన్ని అమలు చేయకపోవడానికి గల కారణాలను మంత్రి సంధ్యారాణి వెల్లడించారు. ‘తిరుమలకు ఫ్రీ బస్ పెడితే జనం ఎక్కువగా ఎక్కుతారు. కొండపై ఎక్కువ మందితో బస్సులు నడవడం ప్రమాదకరం. ఘాట్ రోడ్లలో పరిమిత సంఖ్యలో మాత్రమే వెళ్లాలి. లేదంటే బస్సులు అదుపు తప్పే అవకాశం ఉంటుంది. కొండపైకి వెళ్లాక అక్కడ ఫ్రీ బస్సు సౌకర్యం ఉంది’ అని గుర్తుచేశారు.