News September 15, 2024

కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పక నెరవేరుస్తుంది: రేవంత్

image

TG: ఎన్నో ఇబ్బందుల మధ్య సోనియా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అధికారంలోకి రాగానే రుణమాఫీ చేశామని తెలిపారు. గాంధీభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పక నెరవేరుస్తుందన్నారు. మహాలక్ష్మీ పథకంలో ఇప్పటి వరకు మహిళలు 85 కోట్ల ప్రయాణాలు చేశారని వెల్లడించారు. మోదీ, KCR హయాంలో గ్యాస్ సిలిండర్ రేట్లు భారీగా పెరిగాయని విమర్శించారు.

Similar News

News November 3, 2025

ఎస్వీ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం

image

AP: తిరుపతిలోని SV యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపింది. సైకాలజీ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ విద్యార్థులను సీనియర్స్ ర్యాగింగ్ చేశారు. ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వారిపై సైకాలజీ డిపార్ట్‌మెంట్ HOD విశ్వనాథ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. ‘ర్యాగింగ్ చేస్తారు, ఏమైనా చేస్తారు’ అని అన్నారని, విశ్వనాథ రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

News November 3, 2025

OTTలోకి కొత్త సినిమాలు.. స్ట్రీమింగ్ అప్పుడేనా?

image

దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదలైన సిద్ధూ జొన్నలగడ్డ ‘తెలుసు కదా’, ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’ సినిమాలు త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లోకి రానున్నాయి. ఈ నెల 7 నుంచి ‘తెలుసు కదా’, 14 నుంచి ‘డ్యూడ్’ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఇటీవల విడుదలైన రవితేజ ‘మాస్ జాతర’ సినిమా OTT హక్కులను కూడా నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. నెల రోజుల తర్వాత ఈ మూవీ స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశముంది.

News November 3, 2025

తెలంగాణ న్యూస్ రౌండప్

image

➢ CM రేవంత్‌తో అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధుల భేటీ.. ఈ నెల 14న కొడంగల్‌లోని ఎన్కేపల్లి వద్ద నిర్మించ తలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ కిచెన్ ప్రారంభోత్సవానికి ఆహ్వానం.. ఈ కిచెన్ నుంచి ప్రభుత్వ స్కూళ్లకు మధ్యాహ్న భోజనం సరఫరా
➢ ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు కోసం 700 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు
➢ ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేయాలన్న CCI నిబంధన ఎత్తివేయాలి.. కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ