News May 11, 2024
YSR పేరును సీబీఐ ఛార్జిషీట్‌లో కాంగ్రెస్ చేర్చలేదు: రాహుల్

AP: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. కడప సభలో ఆయన మాట్లాడుతూ.. ‘విభజన సమయంలో APకి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే బాధ్యత మాది. పోలవరం, కడప స్టీల్ ప్లాంట్ ఇస్తాం. CBI ఛార్జిషీటులో YSR పేరుని కాంగ్రెస్ చేర్చలేదు. కొందరు స్వలాభం కోసం ఇలా ప్రచారం చేస్తున్నారు. YSR సిద్ధాంతాలు పార్లమెంట్‌లో వినిపించాలంటే షర్మిలను గెలిపించాలి’ అని కోరారు.
Similar News
News November 16, 2025
సౌతాఫ్రికా ఆలౌట్.. భారత్ టార్గెట్ ఎంతంటే?

కోల్‌కతాలో టీమ్ ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్సులో సౌతాఫ్రికా 153 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ బవుమా 55* పరుగులతో రాణించారు. జడేజా 4, కుల్దీప్, సిరాజ్ చెరో 2, బుమ్రా, అక్షర్ ఒక్కో వికెట్ తీశారు. ఈ టెస్టులో భారత్ గెలవాలంటే 124 రన్స్ చేయాలి.
News November 16, 2025
WOW.. చీమ కాలుపైనున్న వెంట్రుకలను కూడా గుర్తించే లెన్స్!

జార్జియా టెక్ శాస్త్రవేత్తలు విద్యుత్ అవసరం లేకుండా పనిచేసే PHySL అనే విప్లవాత్మక సాఫ్ట్ రోబోటిక్ లెన్స్‌ను సృష్టించారు. చీమ కాలుపై వెంట్రుకలను కూడా గుర్తించగలిగే సామర్థ్యం దీనికుందని చెబుతున్నారు. 4 మైక్రోమీటర్ల వెడల్పున్న అతి చిన్న వస్తువులను సైతం దీంతో స్పష్టంగా చూడొచ్చంటున్నారు. సర్జికల్ రోబోట్‌లు, వైద్యం, వ్యవసాయంతో సహా అనేక రంగాలలో ఈ సాంకేతికత అద్భుతమైన మార్పులు తీసుకొస్తుందని తెలిపారు.
News November 16, 2025
పొద్దుతిరుగుడు విత్తనాలను ఇలా నాటితే మేలు

పొద్దుతిరుగుడు సాగు చేసే రైతులు బోదెలు చేసి విత్తనం నాటినట్లైతే నీటితడులు ఇవ్వడానికి, ఎరువులను వేయుటకు అనుకూలంగా ఉండటమే కాకుండా మొక్కకు పటుత్వం కూడా లభిస్తుంది. నేల స్వభావాన్ని బట్టి విత్తే దూరం నిర్ణయించాలి. తేలిక నేలల్లో వరుసల మధ్య 45 సెం.మీ. మరియు మొక్కల మధ్య 20-25 సెం.మీ. దూరంలో విత్తుకోవాలి. బరువైన నేలల్లో వరుసల మధ్య 60 సెం.మీ. మరియు మొక్కల మధ్య 30 సెం.మీ. దూరంలో విత్తాలి.


