News September 3, 2024
ఆరు సీట్లు ఆఫర్ చేసిన కాంగ్రెస్!

హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌తో పొత్తుకు సిద్ధపడిన కాంగ్రెస్ ఆ పార్టీకి 6 సీట్లు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. పొత్తు విషయమై రాహుల్ గాంధీ సుముఖంగా ఉండడంతో ఈ విషయమై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో ఆప్ ఎంపీ రాఘవ్ చడ్డా సమాలోచనలు జరిపారు. ఈ సందర్భంగా 90 అసెంబ్లీ సీట్లలో ఆమ్ ఆద్మీ పార్టీ 10 సీట్లు కోరగా, కాంగ్రెస్ 6 సీట్లు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.
Similar News
News January 11, 2026
న్యాయం గొప్పదా? ధర్మం గొప్పదా?

సమాజానికి రెండూ అవసరమే. కానీ, న్యాయం కన్నా ధర్మమే గొప్పది, విస్తృతమైనది. ఇది మన అంతరాత్మ, నైతికతకు సంబంధించినది. ఓ వ్యక్తి తన బాధ్యత, కర్తవ్యాన్ని నిబద్ధతతో నిర్వహించడమే ధర్మం. ఇదే శాశ్వత సత్యం. న్యాయం కేవలం చట్టబద్ధమైనది. సాక్ష్యాధారాల ఆధారంగా, క్రమశిక్షణ కోసం మనం ఏర్పరుచుకున్నది. న్యాయం పరిస్థితులను బట్టి మారవచ్చు. కానీ ధర్మం అలా కాదు. ఇది మానవత్వాన్ని కాపాడుతుంది. అందుకే ధర్మమే గొప్పది.
News January 11, 2026
డీ హైడ్రేషన్ ఉంటే ఏమవుతుందంటే?

డీహైడ్రేషన్ ఊబకాయానికి దారితీస్తుంది. రక్త ప్రసరణ సరిగ్గా ఉండదు. దీని వల్ల తలనొప్పి, భారంగా అనిపిస్తుంది. తక్కువ నీరు తాగడం వల్ల మూత్రం చిక్కగా మారుతుంది. బ్యాక్టీరియా పెరిగి ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది. శరీరంలో నీరు లేకపోవడం రక్త ప్రసరణ ప్రభావితం చేస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. దీనివల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గి బలహీనత కలుగుతుంది. ముడతలు, మచ్చలు, మొటిమలు కూడా వస్తాయి.
News January 11, 2026
ESIC గువాహటిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<


