News February 8, 2025
ఆధిక్యంలో ఖాతా తెరిచిన కాంగ్రెస్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738983220380_653-normal-WIFI.webp)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పరువు కోసం పోరాటం చేస్తున్న కాంగ్రెస్ ఎట్టకేలకు ఖాతా తెరిచింది. ఆ పార్టీ ఓ స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది. అటు బీజేపీ, ఆప్ మధ్య థగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. బీజేపీ 15, ఆప్ 13 చోట్ల లీడింగ్‌లో కొనసాగుతున్నాయి.
Similar News
News February 8, 2025
PHOTO: రోజా కూతురు ర్యాంప్ వాక్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738990435750_653-normal-WIFI.webp)
AP: మాజీ మంత్రి రోజా కూతురు అన్షు మాలిక మల్టీ ట్యాలెంట్‌తో అదరగొడుతున్నారు. వెబ్ డెవలపర్‌గా, కంటెంట్ క్రియేటర్‌గా గుర్తింపు పొందిన ఆమె తాజాగా ఫ్యాషన్ రంగంలోనూ రాణిస్తున్నారు. నైజీరియాలో జరిగిన ’గ్లోబల్ ఎంట్రపెన్యూర్షిప్ ఫెస్టివల్’లో ఆమె ర్యాంప్‌పై నడిచి ఆకట్టుకున్నారు. ఆ ఫొటోలను తన ఇన్‌స్టా అకౌంట్లో అన్షు షేర్ చేశారు. ఇటీవల ఆమె గ్లోబల్ ఎంట్రపెన్యూర్షిప్ అవార్డు సైతం అందుకున్నారు.
News February 8, 2025
ఢిల్లీ ఎన్నికల డిసైడర్స్.. పూర్వాంచలీ ఓటర్స్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738989944321_1045-normal-WIFI.webp)
బిహార్, తూర్పు UP, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్ నుంచి వచ్చి ఢిల్లీలో స్థిరపడిన ఓటర్లను పూర్వాంచలీ ఓటర్లుగా వ్యవహరిస్తారు. ఢిల్లీ ఎన్నికల్లో వీరిదే నిర్ణయాత్మక శక్తి. 40 లక్షలమంది ఓటర్లలో 25శాతం ఓట్లు వీరివే. 27 అసెంబ్లీ స్థానాల్లో వీరి ప్రాబల్యం, ప్రభావం ఉంది. 12 సీట్లలో వీరిది మెజారిటీ. గత 2 ఎన్నికల్లోనూ ఆప్‌కు మద్దతుగా నిలిచిన వీరు ఈసారి BJP వైపు మొగ్గు చూపడంతో ఆ పార్టీ గెలుపు దిశగా దూసుకుపోతోంది.
News February 8, 2025
17 సీట్లలో BJP, AAP మధ్య తేడా 1000 ఓట్లే
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738991445500_1199-normal-WIFI.webp)
ఢిల్లీ ఎన్నికల్లో విజేతను నిర్ణయించడంలో 17 నియోజకవర్గాలు కీలకంగా మారనున్నాయి. ఎందుకంటే ఇక్కడ రెండు పార్టీల మధ్య మార్జిన్ 1000 మాత్రమే ఉంది. BJP 12, AAP 5 సీట్లలో 1000 ఓట్ల తేడాతో ముందుకు సాగుతున్నాయి. ఏ ఒక్క రౌండులోనైనా ఏదో ఒక పార్టీకి గుంపగుత్తగా ఓట్లు పడినట్లు తేలితే ఆధిక్యాలు మారడం ఖాయమే. అరవింద్ కేజ్రీవాల్, ఆతిశీ మార్లేనా 1000 ఓట్ల తేడాతోనే ఉన్నారు.