News May 11, 2024
కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదులను కాపాడుతూ వచ్చింది: అమిత్ షా

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి ఏనాడూ కృషి చేయలేదని అమిత్ షా విమర్శించారు. ‘ఉగ్రవాదులను కాంగ్రెస్ కాపాడుతూ వచ్చింది. దేశంలో ఉగ్రవాదాన్ని పారదోలడానికి మోదీ కృషి చేశారు. అయోధ్యలో రామమందిరం అంశాన్ని కాంగ్రెస్ 70ఏళ్లుగా నాన్చుతూ వచ్చింది. మోదీ రెండోసారి PM కాగానే ఐదేళ్లలో ఆలయాన్ని నిర్మించారు. కాంగ్రెస్, మజ్లిస్ను రాష్ట్రం నుంచి తరిమే శక్తి BJPకే ఉంది’ అని వికారాబాద్లో వ్యాఖ్యానించారు.
Similar News
News November 12, 2025
‘పెద్ది’ సినిమాలో సీనియర్ నటి?

రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది’లో సీనియర్ నటి శోభన కీలకపాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. డైరెక్టర్ బుచ్చిబాబు ఆమెను సంప్రదించినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో జాన్వీకపూర్ హీరోయిన్గా కనిపించనున్నారు. జగపతిబాబు, శివరాజ్కుమార్, దివ్యేందు శర్మ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
News November 12, 2025
కష్టాలు ఎన్ని రకాలంటే..?

మనుషులు పడే కష్టాలను వేదాలు 3 రకాలుగా వర్గీకరించాయి. అందులో మొదటిది ఆధ్యాత్మిక దుఖాలు. శరీరంలో కలిగే రోగాలు, కోపం, కపటం, బద్ధకం వల్ల అంతర్గతంగా ఏర్పడతాయి. రెండవది ఆది భౌతిక దుఃఖాలు. ఇవి పంచభూతాలు, శత్రువులు, జంతువులు, కీటకాల వంటి బయటి జీవుల వల్ల కలుగుతాయి. మూడవది ఆది దైవిక దుఃఖాలు. ఇవి ప్రకృతి శక్తులైన అతివృష్టి, అనావృష్టి, పిడుగులు, గ్రహబాధల వల్ల సంభవిస్తాయి. వీటిని దాటడమే మోక్షం. <<-se>>#VedikVibes<<>>
News November 12, 2025
లడ్డూ తయారీలో కల్తీ నెయ్యికి అవకాశమే లేదు: YCP

AP: తమ హయాంలో తిరుమల శ్రీవారి వైభవాన్ని పెంచేలా నిర్ణయాలు తీసుకున్నాం తప్ప ఎలాంటి తప్పూ చేయలేదని వైసీపీ ట్వీట్ చేసింది. ‘లడ్డూ తయారీలో కల్తీ నెయ్యికి అవకాశమే లేదు. కావాలంటే రికార్డులు చూసుకోండి. సిట్ విచారణలో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి క్లారిటీగా సమాధానం ఇచ్చారు. కల్తీ నెయ్యి అంటూ గగ్గోలు పెట్టిన పచ్చమంద సైలెంట్ అయింది’ అని విమర్శించింది.


