News July 25, 2024
‘కాంగ్రెస్’ పోలీస్ ఆఫీసరా?: కేంద్రమంత్రి సెటైర్లు

NEET పవిత్రత చెడిపోలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసినట్టు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఇది కాంగ్రెస్ బాధ్యతారాహిత్య వైఖరి, చిల్లర రాజకీయాల ఓటమని, విద్యార్థులది కాదన్నారు. తమ పార్టీ పోలీస్ ఆఫీసర్ లాంటిదన్న ఖర్గేకు రాజస్థాన్లో పేపర్ లీకులు కనిపించలేదా అని ప్రశ్నించారు. లీకులు, అవినీతికి కేంద్రమైన కాంగ్రెస్ పోలీస్ఆఫీసర్ ఏంటని ఎద్దేవా చేశారు. పరీక్షల నిర్వహణను కట్టుదిట్టం చేస్తామన్నారు.
Similar News
News November 4, 2025
త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టిన ఎస్బీఐ

బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ లాభాలను నమోదు చేసింది. ఈ FYలో సెప్టెంబర్తో ముగిసిన క్వార్టర్లో రూ.20,160 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాదితో పోలిస్తే(రూ.18,331 కోట్లు) 10% వృద్ధి సాధించింది. నికర వడ్డీ ఆదాయం 3% పెరిగి రూ.42,985 కోట్లకు చేరింది. వడ్డీ ద్వారా వచ్చే ఆదాయం రూ.1,19,654 కోట్లకు పెరిగింది. ఫలితాల నేపథ్యంలో SBI షేర్లు స్వల్పంగా లాభపడి రూ.954.6 వద్ద ముగిశాయి.
News November 4, 2025
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్పై కమిటీ

TG: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ సంస్కరణలకు ప్రభుత్వం కమిటీని నియమించింది. స్పెషల్ సీఎస్ ఛైర్మన్గా, ప్రిన్సిపల్ సెక్రటరీ వైస్ ఛైర్మన్గా 15 మందితో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. కాలేజీ యాజమాన్యాల నుంచి ముగ్గురికి, ప్రొఫెసర్లు కంచ ఐలయ్య, కోదండరామ్కు చోటు కల్పించింది. రీయింబర్స్మెంట్ విధానంపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. తీసుకోవాల్సిన చర్యలపై 3 నెలల్లో తమ రిపోర్టును ప్రభుత్వానికి అందజేయనుంది.
News November 4, 2025
ఇతిహాసాలు క్విజ్ – 56 సమాధానాలు

1. కౌరవ, పాండవుల గురువైన ద్రోణాచార్యుడి ‘పరుశరాముడు’.
2. మేఘనాదుడు ‘తమ కుటుంబ దేవత అయిన నికుంభి’లను పూజించడం వల్ల ఇంద్రజిత్ అయ్యాడు.
3. నవ విధ భక్తి మార్గాలలో మొదటిది ‘శ్రవణం’.
4. ప్రతి మాసంలో వచ్చే పన్నెండో తిథి పేరు ‘ద్వాదశి’.
5. సీత స్వయంవరం లో ఉన్న శివ ధనుస్సు అసలు పేరు ‘పినాక’.
<<-se>>#Ithihasaluquiz<<>>


