News July 4, 2024
కాంగ్రెస్ పాలకులు టైం పాస్ చేస్తున్నారు: MP రఘునందన్

TG: కాంగ్రెస్ పార్టీ నేతలకు మేనిఫెస్టో మీద గౌరవం లేదని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. అధికారంలోకి వచ్చి 7 నెలలవుతున్నా హామీలు అమలు చేయకుండా టైం పాస్ చేస్తున్నారని దుయ్యబట్టారు. వరికి మద్దతు ధర, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ రైతు భరోసా, వడ్డీ లేని రుణాలు వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలు తప్ప అభివృద్ధి గురించి ఆలోచించడం లేదని మండిపడ్డారు.
Similar News
News December 3, 2025
తులసి కోట వద్ద నిత్య దీపారాధన ఎందుకు చేయాలి?

తులసి కోట వద్ద నిత్యం దీపం వెలిగించాలని పండితులు సూచిస్తున్నారు. ఫలితంగా ఇంటి నిండా సానుకూల శక్తి ప్రవహిస్తుందని చెబుతున్నారు. ఈ దీపం మన పరిసరాలను శుద్ధి చేసి మనలో పాజిటివ్ ఆలోచనలు కలిగేలా చేస్తుందని అంటున్నారు. ‘లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. కుటుంబ సభ్యులందరూ ప్రశాంతంగా ఉంటారు. సంపద, శ్రేయస్సు, అదృష్టం పెరిగే యోగం కూడా ఉంటుంది’ అని వివరిస్తున్నారు.
News December 3, 2025
స్మృతి మంధాన పెళ్లి కొత్త డేట్ ఇదేనా?

స్మృతి మంధాన, పలాశ్ ముచ్చల్ పెళ్లి వాయిదా పడిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో తొలుత స్మృతి తండ్రి, ఆపై పలాశ్ ఆస్పత్రుల్లో చేరి డిశ్ఛార్జ్ అయ్యారు. కాగా పెళ్లికి కొత్త డేట్ ఫిక్స్ అయిందని, DEC 7న వివాహం జరగనుందని SMలో ప్రచారం జరుగుతోంది. దీనిపై స్మృతి బ్రదర్ శ్రవణ్ స్పందిస్తూ.. ‘ప్రస్తుతానికి పెళ్లి వాయిదా పడింది. కొత్త డేట్ గురించి మేము ప్రకటించలేదు. ప్రచారంలో ఉన్న డేట్ రూమర్ మాత్రమే’ అని చెప్పారు.
News December 3, 2025
సరికొత్త ఆవిష్కరణలకు పట్టం కట్టాలి: పవన్

AP: సరికొత్త ఆవిష్కరణలకు పట్టం కట్టాలని, ఆవిష్కర్తలను గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని Dy.CM పవన్ అన్నారు. అవసరమైతే MSME పార్కుల్లో వీరికి ప్రాధాన్యత ఇచ్చే అంశంపై CMతో చర్చిస్తామని శాస్త్ర, సాంకేతిక శాఖ సమీక్షలో తెలిపారు. ‘అవసరాలకు తగినట్లు మనమే వస్తువులు తయారు చేసుకోవాలి. మేడిన్ ఇండియా, మేకిన్ ఇండియా లక్ష్యం అదే. దిగుమతుల మీద ఆధారపడడం తగ్గిస్తే ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది’ అని చెప్పారు.


