News October 20, 2024

40 లక్షల మందికి రుణమాఫీ అన్న కాంగ్రెస్.. BRS ఫైర్

image

తెలంగాణలోని 40 లక్షల మంది రైతులు రుణమాఫీ పొందారని, తాము చెప్పింది చేశామని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. దీనిపై BRS మండిపడింది. ‘కాంగ్రెస్ పచ్చి అబద్ధాలు మరోసారి బట్టబయలయ్యాయి. తెలంగాణలో 22 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ చేశామని రేవంత్ రెడ్డి కొద్దిరోజుల క్రితమే ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఇప్పుడు 40 లక్షల మందికి మాఫీ చేశామని కాంగ్రెస్ సిగ్గులేకుండా చెప్పుకుంటోంది’ అని ఫైర్ అయింది.

Similar News

News February 3, 2026

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

<>ఆల్ <<>>ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (AIIA)33 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి డిగ్రీ, BE/BTech/MCA/BSc, డిప్లొమా, MCom/MBA, MSc(నర్సింగ్), BCom/BBA, BSc(బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ), డిగ్రీ(యోగా), DMLT, పంచకర్మ(డిప్లొమా), ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 3. వెబ్‌సైట్: https://aiia.gov.in

News February 3, 2026

గుడిలో దర్శనం తర్వాత ఎందుకు కూర్చోవాలి?

image

ఆలయం ప్రశాంతతకు నిలయం. దైవ దర్శనంతో మనలోని కోపం, అహంకారం, స్వార్థం తాత్కాలికంగా దూరమవుతాయి. దర్శనం ముగిసిన వెంటనే జనబాహుళ్యంలోకి వెళ్తే మనసు మళ్లీ పాత ధోరణిలోకి వెళ్ళే అవకాశం ఉంది. అందుకే కాసేపు ప్రశాంతంగా కూర్చుంటే, ఆ దేవాలయంలో జరిగే యజ్ఞ యాగాది క్రతువుల పుణ్య ఫలం వల్ల మనసులోని కల్మషం కరిగిపోతుంది. తద్వారా మనసు ప్రశాంతంగా మారి, కొంత సమయమైనా ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన స్థితిని మనం పొందగలుగుతాము.

News February 3, 2026

ఆ నివేదిక వచ్చాకే రైతులకు రూ.6వేలు!

image

TG: సాగు విస్తీర్ణంపై అధికారులు జయశంకర్ వర్సిటీ ద్వారా శాటిలైట్ సర్వే నిర్వహించారు. ఆ రిపోర్టు ఈ నెల 6వ తేదీకల్లా ఇవ్వాలని ప్రభుత్వం ముందు ఆదేశించింది. తాజాగా మండలాల వారీ నివేదికలు అడగడంతో అధికారులు వాటిని సేకరిస్తున్నారు. దీని ప్రభావం రైతులకు రూ.6వేలు చొప్పున అందాల్సిన 2వ విడత రైతు భరోసాపై పడింది. ఈ నివేదిక అందిన వెంటనే రైతు భరోసా విడుదలకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అధికారులు పేర్కొన్నారు.