News April 4, 2024

రెబల్ నేతలకు కాంగ్రెస్ ‘సెండాఫ్’

image

పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే రెబల్ నేతలకు కాంగ్రెస్ సెండాఫ్ ఇస్తోంది. ఇటీవల తెలంగాణలో PCC మాజీ జనరల్ సెక్రటరీ బక్క జడ్సన్‌పై వేటు వేసింది. పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. తాజాగా.. మహారాష్ట్రకు చెందిన సీనియర్ లీడర్ సంజయ్ నిరుపమ్‌ను సైతం పార్టీ నుంచి తొలగించింది. సొంత పార్టీపై విమర్శలు చేస్తున్నారని తెలిపింది. వీరిద్దరిపై రాబోయే 6ఏళ్ల పాటు ఈ సస్పెన్షన్ కొనసాగనుంది.

Similar News

News November 13, 2024

డిసెంబర్‌లో ‘స్పిరిట్’ స్టార్ట్.. 2026లో రిలీజ్: నిర్మాత

image

రెబల్ స్టార్ ప్రభాస్- సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న ‘స్పిరిట్’ మూవీపై నిర్మాత భూషన్ కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘ఈ మూవీ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. స్క్రిప్ట్ పూర్తిచేసేందుకు సందీప్ శ్రమిస్తున్నారు. డిసెంబర్‌లో ముహూర్తపు షాట్‌ తీసి 2025 జనవరి నుంచి షూట్ వేగంగా సాగుతుంది. కొన్ని సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. 2026 మధ్యలో మూవీ విడుదలవుతుంది’ అని తెలిపారు.

News November 13, 2024

BREAKING: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

image

TG: పెద్దపల్లి-రాఘవాపూర్ దగ్గర ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఓవర్ లోడ్ కారణంగా 6 బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే సిబ్బంది మరమ్మతులు చేపట్టారు.

News November 13, 2024

ఉల్లి ధ‌ర‌లు ఎప్పుడు తగ్గుతాయంటే?

image

ఏడాదంతా దాదాపుగా స్థిరంగా ఉన్న ఉల్లి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దేశంలో అత్య‌ధికంగా ఉల్లి ఉత్పత్తి చేసే మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో రైతుల నుంచి స‌ర‌ఫ‌రా త‌గ్గ‌డ‌మే దీనికి కార‌ణంగా తెలుస్తోంది. రబీ సీజన్‌లోని పాత నిల్వ తక్కువగా ఉండడంతో కొత్త నిల్వ ఇంకా మార్కెట్లకు రాలేదు. ఈ సరఫరా-డిమాండ్‌లో వ్యత్యాసం కారణంగానే ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. మ‌రో 10 రోజుల్లో ధ‌ర‌లు దిగొస్తాయ‌ంటున్నారు.