News August 16, 2024
కాంగ్రెస్ ఫేక్ ప్రచారం మానుకోవాలి: ఈటల

TG: బీజేపీలో బీఆర్ఎస్ విలీనమంటూ కాంగ్రెస్ విషప్రచారం చేస్తుందని ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. అవన్నీ ఊహజనిత వ్యాఖ్యలని కొట్టిపారేశారు. బీజేపీలో అలాంటి చర్చ ఏమీ లేదని, ఫేక్ ప్రచారం మానుకోవాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అన్నారు.
Similar News
News October 27, 2025
వద్దన్నా.. బర్లీ పొగాకు సాగు చేస్తున్నారు

AP: సరైన ధర, కొనుగోలు లేనందున బర్లీ పొగాకు సాగుపై ప్రభుత్వం ఆంక్షలు విధించినా రైతులు వెనక్కు తగ్గడం లేదు. ఈ ఏడాది ఖరీఫ్లో సుమారు 21వేల ఎకరాల్లో ఈ పంటను సాగు చేశారు. ప్రకాశం జిల్లాలో 11,400 ఎకరాల్లో, కర్నూలులో 4 వేలు, పల్నాడు జిల్లాలో 4,600 ఎకరాల్లో.. మరో 7 జిల్లాల్లో కొద్ది విస్తీర్ణంలో బర్లీ పొగాకును సాగు చేస్తున్నట్లు వెల్లడైంది. రైతులు ఏ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారో అధికారులకు కూడా తెలియదు.
News October 27, 2025
కరూర్ తొక్కిసలాట బాధితులతో విజయ్ భేటీ

తమిళనాడులోని కరూర్లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన విషయం తెలిసిందే. దాదాపు నెల రోజుల తర్వాత బాధిత కుటుంబాలను నటుడు, TVK చీఫ్ విజయ్ కలిశారు. మహాబలిపురంలోని ఓ రిసార్ట్లో 50 రూమ్స్ బుక్ చేసి పార్టీ నేతలు బస్సుల్లో వారిని అక్కడికి తీసుకెళ్లారు. బాధితులతో విజయ్ మాట్లాడి వారి పరిస్థితిని తెలుసుకున్నారు. అంతకుముందు మృతుల కుటుంబాలకు విజయ్ రూ.20 లక్షల చొప్పున పరిహారం ప్రకటించడం తెలిసిందే.
News October 27, 2025
చిరంజీవి సినిమాలో కార్తీ!

చిరంజీవితో డైరెక్టర్ బాబీ తెరకెక్కించనున్న సినిమాలో హీరో కార్తీ నటించనున్నట్లు తెలుస్తోంది. బాబీ చెప్పిన గ్యాంగ్స్టర్ కథకు కార్తీ ఓకే చెప్పారని, త్వరలోనే సినిమాను పట్టాలెక్కించి 2027 సంక్రాంతి బరిలో దించాలని చూస్తున్నట్లు టాక్. హీరోయిన్గా మాళవిక మోహనన్, రాశీ ఖన్నాను పరిశీలిస్తున్నట్లు సమాచారం. కేవీఎన్ నిర్మాణ సంస్థ ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించినట్లు టీటౌన్ వర్గాలు చెబుతున్నాయి.


