News June 30, 2024
అసెంబ్లీలో 71కి చేరిన కాంగ్రెస్ బలం

తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 71సీట్లకు చేరింది. తాజాగా చేవెళ్ల BRS MLA కాలె యాదయ్య కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కారు పార్టీ నుంచి మొత్తం ఆరుగురు MLAలు హస్తం పార్టీలో చేరినట్లయింది. దీంతో సభలో కాంగ్రెస్కు 71 మంది MLAల బలం ఉండగా BRS 32కు పడిపోయింది. కాగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 64, BRS 39, BJP 8, MIM 7, CPI 1 సీటు గెలిచాయి.
Similar News
News November 22, 2025
ఏడు శనివారాల వ్రతాన్ని ఎలా చేయాలి?

భార్యాభర్తల్లో ఎవరైనా ఈ వ్రతం చేయవచ్చు. మొదటి వారం శ్రీనివాసుడి చిత్రపటం/విగ్రహాన్ని అలంకరించి, వ్రతం ప్రారంభిస్తున్నామని సంకల్పం చెప్పాలి. కోరిన కోర్కెలు నెరవేరితే 7 కొండలు ఎక్కుతామని ముడుపు కట్టాలి. 7 వారాల పాటు 7 వత్తుల దీపం వెలిగించాలి. పూజ ఎలాగైనా చేయవచ్చు. శనివారాల్లో మద్యమాంసాల్ని ముట్టుకోకూడదు. చివరి వారం వేంకటేశ్వర ఆలయాన్ని సందర్శించాలి. వీలున్నప్పుడు తిరుపతి వెళ్లి ముడుపు సమర్పించాలి.
News November 22, 2025
దేశంలో తీవ్ర వాతావరణ పరిస్థితులు!

దేశంలో తీవ్ర వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కాలాలను బట్టి ఎండ, వానలు, చలి అన్నీ ఎక్కువగానే ఉంటున్నాయి. ఢిల్లీలోని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (CSE) స్టడీలో ఈ విషయం వెల్లడైంది. ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్ మధ్య 273 రోజుల్లో 270 రోజులు తీవ్ర వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపింది. ఈ ప్రభావంతో దేశంలో 4 వేల మందికి పైగా చనిపోయారని, 2.34 కోట్ల ఎకరాల్లో పంట నష్టం సంభవించిందని పేర్కొంది.
News November 22, 2025
‘యాషెస్’ను అసూయతో చూశా: సౌతాఫ్రికా కెప్టెన్

5 టెస్టుల యాషెస్ సిరీస్ను చూస్తే అసూయగా ఉందని సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా అన్నారు. ఇండియాతో టెస్టు సిరీస్ 2 మ్యాచులకే పరిమితం చేయడంపై ఇలా అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘యాషెస్ను చూడటానికి ఉదయాన్నే మేం లేచాం. వాళ్లు 5 టెస్టులు ఆడుతున్నారని తెలిసి అసూయతో చూశాం’ అని చెప్పారు. త్వరలో పరిస్థితి మారుతుందని అనుకుంటున్నామని తెలిపారు. భవిష్యత్తులో భారత్తో 4 టెస్టుల సిరీస్ ఆడేందుకు వస్తామని పేర్కొన్నారు.


