News September 28, 2024
అర్బన్ నక్సల్స్ నియంత్రణలో కాంగ్రెస్: మోదీ

విదేశీ చొరబాటుదారులను ఓటు బ్యాంకుగా స్వాగతిస్తూ సొంత పౌరులను అపహాస్యం చేసే అర్బన్ నక్సల్స్ నియంత్రణలో కాంగ్రెస్ పార్టీ ఉందని PM మోదీ విమర్శించారు. జమ్మూ ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నడూ జవాన్ల త్యాగాలను గౌరవించలేదని ఆరోపించారు. ఈరోజు JKలో జరుగుతున్న మార్పులతో కాంగ్రెస్-NC, PDPలు రెచ్చిపోతున్నాయని, ఇక్కడి ప్రజల అభివృద్ధి వారికి నచ్చడం లేదని దుయ్యబట్టారు.
Similar News
News November 3, 2025
సీఏ ఫలితాలు విడుదల

సీఏ(ఛార్టర్డ్ అకౌంటెన్సీ)-2025 ఫలితాలు విడుదలయ్యాయి. సీఏ ఫౌండేషన్, ఇంటర్మీడియెట్, ఫైనల్ రిజల్ట్స్ ICAI వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు తమ రోల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. సెప్టెంబర్ నెలలో ఈ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.
వెబ్సైట్: <
News November 3, 2025
కార్తీక పౌర్ణమి: తిరుపతి కపిలేశ్వరస్వామి ఆలయంలో ఏం చేస్తారంటే..?

కార్తీక పౌర్ణమి సందర్భంగా తిరుపతిలోని కపిలేశ్వరస్వామివారి ఆలయంలో అన్నాభిషేకం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భక్తులకు అభిషేకించిన అన్నాన్ని ప్రసాదంగా పంచి పెడతారు. ఈ అన్నాభిషేక కార్యక్రమాన్ని వీక్షించి, ప్రసాదంగా కొంచెం అన్నాన్ని స్వీకరించడం వలన ఎలాంటి రోగాలైన పోతాయని, సమస్త పాపాలు నశించిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కార్తీక పౌర్ణమి రోజున శ్రీవారి దర్శనార్థం తిరుమల వెళ్తున్న భక్తులకిది మంచి అవకాశం.
News November 3, 2025
CSIR-NEERIలో ఉద్యోగాలు

CSIR-నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(NEERI) మద్రాస్ కాంప్లెక్స్ 3 ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 7న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి BE, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. ఎంపికైన వారికి నెలకు రూ.31వేలతో పాటు HRA చెల్లిస్తారు. వెబ్సైట్: https://www.csircmc.res.in/


