News April 25, 2024

సొంత అభ్యర్థికి ఓటు వేయెుద్దంటున్న కాంగ్రెస్.. ఎందుకంటే?(1/2)

image

రాజస్థాన్‌లోని బన్‌స్వారా లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వింత అనుభవం ఎదురైంది. సొంత అభ్యర్థికి ఓటు వేయొద్దని కోరాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి కారణం భారత్ ఆదివాసీ పార్టీకి CONG మద్దతివ్వడమే. ముందుగా కాంగ్రెస్ ఈ స్థానం నుంచి అరవింద్ దామోర్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. అయితే ఆ తర్వాత BAPతో పొత్తు కుదరడంతో దామోర్‌ను నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలని కోరింది.

Similar News

News December 7, 2025

తెలంగాణ దిశా దశను మార్చనున్న గ్లోబల్ సమ్మిట్: పొంగులేటి

image

TG: రేపటి నుంచి జరిగే గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ దిశా దశను మార్చనుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రపంచ ఉన్నత నగరాల స్థాయికి ఫ్యూచర్ సిటీ చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. 2047 లక్ష్యంగా సాగుతున్న ప్రణాళికలకు ఊతమిచ్చే విధంగా పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. సుమారు 150 మంది అత్యంత ప్రముఖులు ఈ సమ్మిట్‌లో పాల్గొనబోతున్నారని చెప్పారు.

News December 7, 2025

గొర్రె పిల్లలకు ఎలాంటి ఆహారం ఇస్తే మంచిది?

image

గొర్రె పిల్లలకు పుట్టిన మొదటి రోజు నుంచి 20 వారాల వయసు వచ్చేవరకు వివిధ దశలలో సరిపడేంతగా పాలను, క్రీపు దాణాను, T.M.R(టోటల్‌ మిక్స్‌డ్‌ రేషన్‌)ను నిర్దేశిత పరిమాణంలో అందించాలి. వీటిని సరైన పరిమాణంలో అందిస్తే 5 లేదా 6 నెలల వయసులోనే గొర్రె పిల్లలు 28 నుంచి 30 కిలోల బరువు పెరుగుతాయి. దీని వల్ల త్వరగా వీటిని కోతకు అమ్మి మంచి ఆదాయం పొందవచ్చు. అలాగే వాటి మరణాల శాతాన్ని కూడా గణనీయంగా తగ్గించవచ్చు.

News December 7, 2025

ఏడుకొండల వాడికి పుష్ప కైంకర్యం చేసిన భక్తుడు

image

శ్రీవారికి పుష్ప కైంకర్యం చేసిన గొప్ప భక్తుడు అనంతాళ్వార్. ఈయన రామానుజాచార్యుల శిష్యుడు. గురువు ఆదేశం మేరకు తిరుమలలో స్వామివారి సేవకు పూల తోటను పెంచారు. ఓసారి స్వామివారు పిల్లవాడి రూపంలో వచ్చి ఆయనను పరీక్షించగా కోపంతో గునపం విసిరారు. అది తగిలి స్వామివారి చుబుకానికి గాయమైంది. అందుకే శ్రీవారి గడ్డంపై కర్పూరపు చుక్క పెట్టడం ఇప్పటికీ ఆనవాయితీగా ఉంది. ఆ గునపాన్ని తిరుమలతో చూడవచ్చు. <<-se>>#VINAROBHAGYAMU<<>>