News April 25, 2024
సొంత అభ్యర్థికి ఓటు వేయెుద్దంటున్న కాంగ్రెస్.. ఎందుకంటే?(2/2)

అదే సమయంలో దామోర్ తెలిసి తెలియనట్లుగా వ్యవహరించారు. ఈ క్రమంలో విత్‌డ్రా గడువు ముగియడంతో ఇక్కడ త్రిముఖ పోరు నెలకొంది. దీంతో స్థానిక నేతలు అంతా కాంగ్రెస్ మద్దతు ఇస్తున్న BAP అభ్యర్థి రాజ్ కుమార్‌కి ఓటెయ్యాలని ప్రచారం చేస్తున్నారు. మరోవైపు BAP వ్యతిరేక గళాలను దామోర్ తనకు అనుకూలంగా పోగేస్తున్నారు. అయితే ఈ వ్యవహారం బీజేపీకి ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Similar News
News November 27, 2025
7,948 MTS, హవల్దార్ పోస్టులు.. త్వరలో ఎగ్జామ్ షెడ్యూల్

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(<
News November 27, 2025
ఆన్లైన్ కంటెంట్ చూసేందుకు ఆధార్‌తో ఏజ్ వెరిఫికేషన్?

OTT/ఆన్లైన్ కంటెంట్‌పై సుప్రీంకోర్టు కీలక సూచన చేసింది. అశ్లీలంగా భావించే కంటెంట్ విషయంలో ఆధార్ ద్వారా ఏజ్ వెరిఫికేషన్ చేయవచ్చని చెప్పింది. ‘షో ప్రారంభంలో వేసే హెచ్చరిక కొన్నిక్షణాలే ఉంటుంది. తర్వాత కంటెంట్ ప్రసారం కొనసాగుతుంది. అందుకే ఆధార్ వంటి వాటితో వయసు ధ్రువీకరించాలి. ఇది సూచన మాత్రమే. పైలట్ ప్రాతిపదికన చేపట్టాలి. మనం బాధ్యతాయుత సొసైటీని నిర్మించాలి’ అని CJI జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు.
News November 27, 2025
కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు

AP: దిత్వా తుఫాను ప్రభావంతో రేపు GNT, బాపట్ల, ప్రకాశం, NLR, ATP, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, TPT జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు APSDMA తెలిపింది. ‘శనివారం అన్నమయ్య, చిత్తూరు, TPT జిల్లాల్లో అతిభారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఆదివారం ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, TPT జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్సుంది’ అని పేర్కొంది.


