News June 17, 2024
ఏపీలో కాంగ్రెస్‌కు పునర్వైభవం వస్తుంది: షర్మిల

AP: కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకతో ఢిల్లీలోని వారి నివాసంలో సమావేశమైనట్లు APCC చీఫ్ షర్మిల తెలిపారు. ‘రాష్ట్ర కాంగ్రెస్ భవిష్యత్ ప్రణాళికలు, తదుపరి కార్యాచరణపై నిర్మాణాత్మకమైన చర్చ జరిగింది. రాబోయే రోజుల్లో ఏపీలో కాంగ్రెస్ పునర్వైభవం సాధించడమే కాదు బలీయమైన శక్తిగా అవతరిస్తుంది’ అని Xలో పేర్కొన్నారు. ‘ప్రేమ, సంరక్షణ, ప్రేరణ’ అంటూ వారితో దిగిన ఫొటోతో లవ్ సింబల్ షేర్ చేశారు.
Similar News
News March 20, 2026
నేడే రాష్ట్ర బడ్జెట్

TG: 2026-27 రాష్ట్ర బడ్జెట్‌కు వేళయింది. ఇవాళ మధ్యాహ్నం అసెంబ్లీలో DyCM భట్టి, మండలిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు ఉదయం అసెంబ్లీ కమిటీ హాలులో క్యాబినెట్ సమావేశమై బడ్జెట్‌ను ఆమోదించనుంది. ఈ ఏడాది బడ్జెట్ ₹3.36 లక్షల కోట్లుగా ఉండనుందని తెలుస్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయానికి ప్రాధాన్యం ఉంటుందని, ఇరిగేషన్ ప్రాజెక్టులకు ₹29 వేల కోట్లు కేటాయించవచ్చని సమాచారం.
News March 20, 2026
భారీ ఆఫర్‌ను తిరస్కరించిన రాజస్థాన్ రాయల్స్?

IPL జట్టు రాజస్థాన్ రాయల్స్ భారీ ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. కొలంబియా పసిఫిక్ క్యాపిటల్ పార్ట్‌నర్స్(CPCP) కన్సార్షియం వేసిన $1.7 బిలియన్ల(₹16 వేల కోట్లు) బిడ్‌ను ఫ్రాంచైజీ అంగీకరించలేదని NDTV తెలిపింది. మరింత వాల్యుయేషన్ కోసమే RR ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. RCBని కొనుగోలు చేసేందుకు స్వీడన్ కంపెనీ ‘ఈక్యూటీ(EQT)’ ₹18,486 కోట్లకు బిడ్ దాఖలు చేసినట్లు <<19422000>>వార్తలు రావడం<<>> తెలిసిందే.
News March 20, 2026
మరో వివాదంలో పైలట్ రోహిత్ రెడ్డి!

TG: డ్రగ్స్ కేసులో <<19404520>>అరెస్టయిన<<>> Ex MLA పైలట్ రోహిత్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. మొయినాబాద్‌లోని ఆయన ఫామ్‌హౌస్ అసైన్డ్ భూమిలో ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారని తెలుస్తోంది. జంగయ్య అనే వ్యక్తి పేరుతో ల్యాండ్ ఉందని సమాచారం. దీంతో ఆ భూమి రోహిత్ రెడ్డి చేతికి ఎలా వెళ్లిందనేది తెలుసుకుంటామని, ఆ తర్వాత చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. అవసరమైతే ఫామ్‌హౌస్‌ను సీజ్ చేస్తామంటున్నారు.


