News May 23, 2024
కాంగ్రెస్కు 40 సీట్ల కూడా రావు: అమిత్ షా

లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 40 సీట్లు కూడా రావని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఓటు బ్యాంకు పోతుందనే రాహుల్, అఖిలేశ్ యాదవ్ రామమందిరాన్ని సందర్శించట్లేదని దుయ్యబట్టారు. యూపీలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ఇప్పటికే బీజేపీ 310 సీట్లు గెలుచుకుందని ఉద్ఘాటించారు. ఇప్పటివరకు జరిగిన పోలింగ్ను గమనిస్తే కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయిందని అర్థమవుతుందన్నారు.
Similar News
News November 14, 2025
4 రౌండ్లు ముగిసే సరికి ఆధిక్యంలో కాంగ్రెస్

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. నాలుగో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 9వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు 4 రౌండ్లలోనూ ఆయన లీడ్ సాధించారు. BRSకు మూడో రౌండ్లోని ఒక EVMలో స్వల్ప ఆధిక్యం వచ్చింది. ప్రస్తుతం ఐదో రౌండ్ ఓట్లు లెక్కిస్తున్నారు.
News November 14, 2025
వంటింటి చిట్కాలు

* పండ్లు, కూరగాయలు త్వరగా పాడవకుండా ఉండాలంటే వేడినీళ్లలో రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్ వేసి కడగాలి. ఆ తర్వాత సాధారణ నీటితో కడగాలి.
* దోసెలు పెనానికి అతుక్కుపోకుండా ఉండాలంటే ముందుగా పెనంపై వంకాయ లేదా ఉల్లిపాయ ముక్కతో రుద్దితే చాలు.
* కాకరకాయ కూరలో సోంపు గింజలు/ బెల్లం వేస్తే చేదు తగ్గుతుంది.
* పుదీనా చట్నీ కోసం మిక్సీలో పదార్థాలని ఎక్కువ సేపు తిప్పకూడదు. ఇలా చేస్తే చేదుగా అయిపోతుంది.
News November 14, 2025
ఒకేరోజు ఓటీటీలోకి వచ్చేసిన 3 సినిమాలు

ఇవాళ ఏకంగా మూడు సినిమాలు ఒకే OTTలోకి వచ్చేశాయి. సిద్ధు, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి నటించిన ‘తెలుసు కదా’, ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘డ్యూడ్’, ధ్రువ్ విక్రమ్, అనుపమ పరమేశ్వర్ కలిసి నటించిన ‘బైసన్’ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. విడుదలైన నెల రోజులలోపే ఈ చిత్రాలు స్ట్రీమింగ్కు రావడం గమనార్హం.


