News October 20, 2024

రాష్ట్రంలో కాంగ్రెస్ నయవంచక పాలన: హరీశ్

image

TG: రాష్ట్రంలో కాంగ్రెస్ నయవంచక పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి హరీశ్ రావు దుయ్యబట్టారు. కరీంనగర్(D) మానుకొండూరు ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్యారంటీ పేరుతో రేవంత్ సర్కారు గారడీ చేస్తుందని విమర్శించారు. రైతు భరోసా, రుణమాఫీ అమలులో విఫలమైందన్నారు. కరోనా సమయంలోనూ కేసీఆర్ రైతు బంధు ఇచ్చారని గుర్తు చేశారు. రైతు వ్యతిరేక రేవంత్‌‌పై పోరాటానికి అంతా సంఘటితం కావాల్సిన అవసరం ఉందన్నారు.

Similar News

News September 13, 2025

బాగా నమిలి తినండి: వైద్యులు

image

ఆహారాన్ని గబగబా తినొద్దని, అలా చేస్తే సరిగ్గా జీర్ణం కాదని వైద్యులు చెబుతున్నారు. ఎంత తక్కువ సమయంలో తినడం పూర్తి చేస్తే అంత ఎక్కువగా బరువు పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. వేగంగా, నమలకుండా తింటే సరిపడనంత తిన్నామనే భావన కలగదని.. అరగంట పాటు నెమ్మదిగా, బాగా నమిలి తినాలని సూచిస్తున్నారు. దీనివల్ల అది పూర్తిగా జీర్ణమై పోషకాలన్నీ శరీరానికి అందుతాయని, అలాగే దవడలకూ మేలు జరుగుతుందని వివరిస్తున్నారు.

News September 13, 2025

ఇండియా-పాక్ మ్యాచ్ బాయ్‌కాట్ చేయాలి: రాజా సింగ్

image

పాకిస్థాన్‌తో టీమ్ ఇండియా మ్యాచ్ ఆడొద్దని TG ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఆసియా కప్‌లో రేపు జరిగే మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని పిలుపునిచ్చారు. పహల్గామ్ దాడి తర్వాత పాక్‌తో మ్యాచ్ సరికాదని అభిప్రాయపడ్డారు. దీనిపై నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశారు. భారతీయులందరూ ఇదే డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. అటు ఈ మ్యాచ్ చూసేందుకు ఆసక్తి చూపకపోవడంతో టికెట్ సేల్స్ కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి.

News September 13, 2025

ASIA CUP: నిప్పులు చెరిగిన లంక బౌలర్లు

image

ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచులో శ్రీలంక బౌలర్లు విజృంభించారు. నువాన్ తుషారా, దుష్మంత చమీర నిప్పులు చెరిగే బంతులతో బంగ్లా బ్యాటర్లకు చుక్కలు చూపించారు. దీంతో ఖాతా తెరవకుండానే బంగ్లా తొలి రెండు ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు తంజిద్ హసన్(0), పర్వేజ్ ఎమోన్(0) డకౌట్లుగా వెనుదిరిగారు. హృదోయ్ (8) రనౌట్‌గా వెనుదిరిగారు. ప్రస్తుతం బంగ్లా స్కోర్ 5 ఓవర్లలో 16/3గా ఉంది.