News August 27, 2024

లిక్కర్ పాలసీ కేసుపై కాంగ్రెస్ వింత వైఖ‌రి

image

ఢిల్లీ లిక్క‌ర్ పాల‌సీ కేసుపై కాంగ్రెస్ వైఖ‌రి చ‌ర్చనీయాంశం అవుతోంది. ఒక‌వైపు ఇదొక అక్ర‌మ కేసు అంటూనే ఈ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు కాంగ్రెస్ పార్టీ స‌హా ఇండియా మిత్ర‌ప‌క్షాలు సంఘీభావం ప్ర‌క‌టించాయి. అయితే ఇదే కేసులో అరెస్టైన BRS MLC క‌విత విడుద‌ల‌పై మాత్రం అందుకు భిన్నంగా స్పందిస్తోంది. BJP,BRS మ‌ధ్య డీల్ కుదిరింది కాబ‌ట్టే క‌విత విడుద‌లయ్యారంటూ Tకాంగ్రెస్ విమర్శిస్తుండడం గమనార్హం.

Similar News

News November 24, 2025

26న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణం

image

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారానికి టైమ్ ఫిక్స్ అయింది. ఈ నెల 26న అసెంబ్లీలోని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన ఛాంబర్లో నవీన్ యాదవ్‌తో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో సహా పలువురు కాంగ్రెస్ పెద్దలు హాజరుకానున్నారు. కాగా, ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో నవీన్ యాదవ్ 24,658 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే.

News November 24, 2025

అది మీ తప్పు కాదు

image

ప్రేమలో విఫలం అయిన తర్వాత చాలామంది తమ లోపాల వల్లే అలా అయిందని బాధపడుతుంటారు. ఇలాంటి ప్రతికూల ఆలోచనలు డిప్రెషన్‌కు కారణమవుతాయంటున్నారు నిపుణులు. వాళ్ల ఆలోచనలు, గత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకోవడం సరికాదు. సానుకూల దృక్పథం, స్వీయ ప్రేమను అలవర్చుకొని జీవితంలో ముందుకు సాగాలి. ఎంత ప్రయత్నించినా బాధ నుంచి బయటపడలేకపోతుంటే మానసిక నిపుణులను సంప్రదించడం మంచిది.

News November 24, 2025

ముగిసిన ఐబొమ్మ‌ రవి విచారణ.. కీలక విషయాలు వెలుగులోకి!

image

మూవీ పైరసీ కేసులో ఐబొమ్మ రవి 5 రోజుల పోలీసు విచారణ ముగిసింది. స్నేహితుడు నిఖిల్‌తో కలిసి రవి డేటా హ్యాండ్లింగ్, సర్వర్ యాక్సెస్ వంటి అంశాల్లో పాల్గొన్నట్లుగా సమాచారం. టెలిగ్రామ్ యాప్ ద్వారా పైరసీ సినిమాల కొనుగోలు, USDT చెల్లింపులు, APK లింక్స్‌తో బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేసినట్లు తెలుస్తోంది. విచారణ ముగిశాక రవిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు అనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు.