News April 15, 2025
తిరుమలలో వరుసగా అపచారాలు: YSRCP

AP: తిరుమల కొండపై వరుసగా మహాపచారాలు జరుగుతున్నాయని YCP Xలో ఆరోపణలు చేసింది. ‘కొండపై మద్యం, బిర్యానీ ప్యాకెట్లు దర్శనమిస్తున్నాయి. చెప్పులు వేసుకుని భక్తులు మహాద్వారం వద్దకు వచ్చేవరకు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది నిద్రపోతున్నారా? ఇప్పుడు టీటీడీ గోశాలలో వందలాది ఆవులు చనిపోయాయి. అసమర్థుడైన బీఆర్ నాయుడికి అన్నీ అప్పగించి తిరుమలను ఏం చేద్దామని అనుకుంటున్నావ్?’ అని CM CBNను ప్రశ్నిస్తూ ఓ ఫొటో పంచుకుంది.
Similar News
News November 7, 2025
వంటింటి చిట్కాలు

* కూరలో పులుపు తక్కువైతే మామిడిపొడితో పాటు కొంచెం పెరుగు వేస్తే టమోటా రుచి వస్తుంది.
* పెరుగుపచ్చడి రుచిగా ఉండాలంటే తాలింపు పెట్టేప్పుడు కొద్దిగా నెయ్యి వేయాలి.
* కట్ చేసిన బెండకాయల మీద నిమ్మరసం చల్లి వంట చేస్తే బెండకాయలమీద జిగురు ఉండదు.
* వెల్లుల్లి రెబ్బలను నీటిలో నానబెట్టి తీస్తే త్వరగా పొట్టు వదిలిపోతుంది.
News November 7, 2025
కరివేపాకు సాగు.. పొలం తయారీ, నాటే విధానం

కరివేపాకు సాగు చేయదలచే రైతులు విత్తనాన్ని నేరుగా భూమిలో నాటడం వల్ల మొక్క పెరుగుదలలో లోపాలు రావొచ్చు. దీనికి బదులు 1 నుంచి 1.5 సంవత్సరాల మొక్కలను వర్షాకాలంలో నాటితే మంచి ఫలితాలు పొందొచ్చు. నాటే ముందు నేలను 4-5 సార్లు బాగా దుక్కివచ్చే వరకు దున్నాలి. 45X45X45 సెం.మీ గుంతలను 1X1 మీటర్ల దూరంలో తీయాలి. ప్రతి గుంతకు పశువుల ఎరువు 10 కిలోల చొప్పున వేయాలి. ఒక హెక్టారుకు 10వేల మొక్కలను నాటుకోవచ్చు.
News November 7, 2025
దక్షిణ మధ్య రైల్వేలో 61 ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<


