News November 28, 2024
వివాహేతర సంబంధాల్లో ఇష్టపూర్వక సెక్స్ నేరం కాదు: సుప్రీంకోర్టు
వివాహేతర సంబంధాల్లో సుదీర్ఘకాలం ఇష్టపూర్వకంగా శృంగారంలో పాల్గొని, విభేదాలు వచ్చాక పురుషులపై మహిళలు రేప్‌కేసులు పెట్టే సంస్కృతి పెరగడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. పెళ్లి చేసుకుంటారన్న హామీతోనే కచ్చితంగా శారీరక సంబంధం పెట్టుకుంటారని చెప్పలేమని జస్టిస్‌లు BV నాగరత్న, కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం తెలిపింది. ముంబై ఖర్గార్ స్టేషన్లో ఓ వివాహితుడిపై ఏడేళ్ల క్రితం విడో పెట్టిన కేసును కొట్టేసింది.
Similar News
News November 28, 2024
చిన్మయ చర్యలు ఆయన వ్యక్తిగతం: బంగ్లా ఇస్కాన్
చిన్మయ కృష్ణదాస్‌కు తమకు సంబంధం లేదని బంగ్లా ఇస్కాన్ తాజాగా స్పష్టం చేసింది. క్రమశిక్షణా చర్యలకింద చాలాకాలం క్రితమే సంస్థ నుంచి తొలగించామని పేర్కొంది. దాస్ వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమని, వాటితో తమకు సంబంధం లేదని తేల్చిచెప్పింది. ఆయన మాటలకు, చర్యలకు తాము బాధ్యులం కాదని తెలిపింది. కాగా.. సనాతన జాగరణ్ మంచ్‌కు చిన్మయ ప్రస్తుతం అధికార ప్రతినిధిగా ఉన్నారు.
News November 28, 2024
బిల్లులన్నీ పెండింగ్‌లో పెట్టారు: జగన్
APలో ఆరోగ్యశ్రీ బిల్లులన్నీ పెండింగ్‌లో పెట్టారని YS జగన్ ధ్వజమెత్తారు. ‘కూటమి అధికారంలోకి రాగానే వాలంటీర్ల ఉద్యోగం పోయింది. సచివాలయ వ్యవస్థ అగమ్యగోచరంగా ఉంది. రూ.2800 కోట్ల విద్యాదీవెన బకాయిలు, రూ.1100 కోట్లు వసతి దీవెన బకాయిలు పెట్టడంతో విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారు. ఆరోగ్య శ్రీ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు చేయడం లేదు. 108, 104 పడకేశాయి’ అని ఆరోపించారు.
News November 28, 2024
షమీకి బీసీసీఐ డెడ్‌లైన్!
BGT సిరీస్‌లోకి తీసుకునేందుకు మహ్మద్ షమీకి బీసీసీఐ డెడ్ లైన్ విధించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ ఆడుతున్న షమీకి ప్రతి స్పెల్ అనంతరం బీసీసీఐ మెడికల్ టీమ్ చికిత్స అందిస్తోంది. ఆయన బరువెక్కువ ఉన్నారని, మరో 10రోజుల్లో తగినంత తగ్గి ఫిట్‌నెస్ నిరూపించుకోవాలని బీసీసీఐ చెప్పినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే మూడో టెస్టుకు షమీ అందుబాటులోకి రావొచ్చని అంచనా.