News November 28, 2024
నాపై కేసుల వెనుక కుట్ర: RGV
తనపై కేసుల విషయంలో దర్శకుడు RGV ట్విటర్‌లో పాయింట్ల రూపంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను ఎక్కడికీ పారిపోలేదు. ఏడాది క్రితం చేసిన ట్వీట్లపై 2 వారాల క్రితం 4 వేర్వేరు జిల్లాల్లో కేసు పెట్టడం వెనుక ఏదో కుట్ర ఉందనేది నా అనుమానం. మీమ్స్‌పై కేసులు పెట్టాలంటే దేశంలో సగంమందిపై కేసులుంటాయి. మీడియా కాల్స్ భరించలేకే ఫోన్ ఆపేశాను. చట్టాన్ని గౌరవిస్తా. కానీ నా హక్కులు నాకున్నాయి’ అని ట్వీట్ చేశారు.
Similar News
News November 28, 2024
డిసెంబర్ 15న WPL వేలం
వచ్చే నెల 15న బెంగళూరులో WPL (వుమెన్స్ ప్రీమియర్ లీగ్) వేలం జరగనుంది. ప్లేయర్ల కొనుగోలు కోసం అత్యధికంగా GT వద్ద 4.4 కోట్లు, అతితక్కువగా DC వద్ద రూ.2.5 కోట్లు మనీ పర్స్‌లో ఉన్నాయి. ఇందులో హీథర్ నైట్, లీ తహుహూ, డియోండ్ర డాటిన్, స్నేహ్ రాణా, పూనమ్ యాదవ్, వేద కృష్ణమూర్తి భారీ ధర పలికే ఛాన్స్ ఉంది. WPLలో బెంగళూరు, ముంబై, లక్నో, ఢిల్లీ, అహ్మదాబాద్ జట్లు ఉన్న సంగతి తెలిసిందే.
News November 28, 2024
చైనాలో కీలక అధికారిపై జిన్‌పింగ్ వేటు
చైనా కేంద్ర మిలిటరీ కమిషన్(CMC) సభ్యుడైన మియావో హువా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో అధ్యక్షుడు జిన్‌పింగ్ సస్పెండ్ చేశారు. CMC అనేది చైనాలో అత్యంత శక్తిమంతమైన సంస్థ కావడం గమనార్హం. ‘హువా క్రమశిక్షణ తప్పినట్లు ఆరోపణలున్నాయి. దర్యాప్తు జరుగుతున్నందున విధుల నుంచి తప్పించాం’ అని రక్షణ శాఖ ప్రతినిధి కియాన్ తెలిపారు. రక్షణ మంత్రి డాంగ్ జున్‌పైనా దర్యాప్తు జరుగుతోందన్న వార్తల్ని ఆయన ఖండించారు.
News November 28, 2024
IPL: జితేశ్ శర్మ హైక్ 5,400 శాతం..!
ఐపీఎల్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని రికార్డును టీమ్ ఇండియా ప్లేయర్ జితేశ్ శర్మ అందుకున్నారు. వేలంలో ఆయన తన పాత ధర కంటే 5,400% ఎక్కువ పలికారు. 2024లో ఆయన రూ.20 లక్షలకే పంజాబ్ తరఫున ఆడారు. ఈ వేలంలో ఏకంగా రూ.11 కోట్లతో తన పంట పండించుకున్నారు. ఇంత భారీ మొత్తంలో శాలరీ హైక్ సాధించిన ప్లేయర్ మరొకరు లేరు. వికెట్ కీపింగ్ నైపుణ్యం, లోయర్ ఆర్డర్‌లో ఫినిషర్‌గా మంచి పేరుండటంతో RCB అతడిని కొనేసింది.