News November 28, 2024
ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక కుట్ర కోణం: మంత్రి సీతక్క

TG: గురుకులాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. వీటి వెనుక కుట్ర కోణం ఉందని, త్వరలోనే కుట్రదారులను బయటపెడతామని ప్రకటించారు. ఇందులో ఉద్యోగుల భాగస్వామ్యం ఉంటే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా ఇటీవల పలు స్కూళ్లలో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.
Similar News
News December 8, 2025
మైక్రోసైటిక్ అనీమియా గురించి తెలుసా?

మైక్రోసైటిక్ అనీమియా వల్ల శరీరంలో రక్త కణాల పరిమాణం తగ్గుతుంది. దీంతో శరీరంలో ఆక్సిజన్ తగ్గి అలసట, మైకము, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడమేకాకుండా అనేక తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయి. ఐరన్ లోపం కారణంగా కూడా మైక్రోసైటిక్ అనీమియా తలెత్తే అవకాశం ఉంటుంది.
News December 8, 2025
ఈ హాస్పిటల్లో అన్నీ ఉచితమే..!

AP: వైద్యం కాస్ట్లీ అయిపోయిన ఈరోజుల్లో ఉచితంగా ప్రపంచస్థాయి వైద్యం అందిస్తోంది కూచిపూడిలోని(కృష్ణా) రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రి. 200 పడకలు ఉన్న ఈ ఆసుపత్రిలో రోగ నిర్ధారణ నుంచి శస్త్రచికిత్సల వరకు అన్నీ ఉచితమే. దాదాపు 70 గ్రామాల ప్రజలకు ఈ ఆసుపత్రి సేవలందిస్తోంది. పేదల సంజీవనిగా పేరొందిన ఈ హాస్పిటల్ను సందర్శించిన బీజేపీ నేత యామిని శర్మ ట్వీట్ చేయడంతో దీనిపై చర్చ జరుగుతోంది.
News December 8, 2025
సరసమైన ధరలున్నా.. BSNLవైపు మళ్లట్లేదు!

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL ఇటీవల రూ.485 ప్లాన్(72 రోజులు డైలీ 2GB డేటా) తీసుకొచ్చింది. ఇలాంటి ఎన్నో ప్లాన్స్ ఉన్నా యూజర్లు BSNLవైపు మళ్లట్లేదని టెలికాం రంగ నిపుణులు చెబుతున్నారు. ‘ప్రైవేట్ సంస్థలు 5G సేవలు అందిస్తుండగా BSNL ఇంకా 4Gకే పరిమితమైంది. డేటా స్పీడ్ తగ్గడం, కాల్ డ్రాప్స్, నెట్వర్క్ కవరేజ్ సమస్యల వల్లే ప్రైవేట్ సంస్థల వైపు వెళ్తున్నారు’ అని అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీ కామెంట్?


