News May 12, 2024
ఉక్రెయిన్ అధ్యక్షుడి హత్యకు కుట్ర

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హత్యకు రష్యా చేసిన కుట్రను భగ్నం చేసినట్లు ఆ దేశ ఉన్నతాధికారులు ప్రకటించారు. జెలెన్స్కీతో సహా మరికొందరు సైనిక అధికారులు, రాజకీయ నేతల హత్యకు యత్నించారని ఆరోపించారు. ఈ ఘటనలో స్టేట్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ అధిపతిని తొలగించామని, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా రష్యా తమ వాంటెడ్ లిస్ట్లో జెలెన్స్కీని చేర్చినట్లు ఇటీవల వెలుగులోకి వచ్చింది.
Similar News
News November 21, 2025
మొక్కలకు బోరాన్ ఎందుకు అవసరం?

బోరాన్ అనే ఈ సూక్ష్మధాతు మూలకం బోరిక్ యాసిడ్ స్థితిలో మొక్కలకు అందుబాటులోకి వస్తుంది. ఇది మొక్కల్లో, నేలల్లో నిశ్చల స్థితిలో ఉంటుంది. మొక్క ఆకులలో తయారయ్యే ఆహారాన్ని అన్ని భాగాలకు చేరవేయడంలో బోరాన్ కీలక పాత్ర పోషిస్తుంది. మొక్కల సంపర్క ప్రక్రియలో ఉపయోగపడే పుప్పొడి ఉత్పత్తిలో, పుప్పొడి కణాల ఎదుగుదలను నియంత్రిస్తూ విత్తన, పండ్ల ఎదుగుదలను నిలువరిస్తుంది. మొక్క కాల్షియం గ్రహించడానికి తోత్పడుతుంది.
News November 21, 2025
మొక్కల్లో బోరాన్ లోపిస్తే ఏం జరుగుతుంది?

బోరాన్ లోపం వల్ల మొక్కలో పెరిగే భాగాలైన వేర్లు, లేత చిగురు, లేత కొమ్మలు, లేత పత్రాలపై ప్రభావం పడుతుంది. ఈ లోపానికి సరైన మొక్కల్లో చిగుర్లు వికృతాకారంలో ఉంటాయి. ఆకులు చిన్నవిగా ఉండి విచ్చుకోకుండా కుచించుకుపోయి కాండపు కణుపు మీద ఉంటాయి. దీని వల్ల మొక్క కురచగా, గుబురుగా కనిపిస్తుంది. చిగుర్ల నుంచి కొమ్మలు ఏర్పడతాయి. లేత ఆకులు ఈనెల మధ్య భాగాలు పసుపు/తెలుపు చారలుగా మారతాయి. తర్వాత ముడుచుకుపోతాయి.
News November 21, 2025
సీఎం మార్పు ప్రచారంపై డీకే శివకుమార్ క్లారిటీ

కర్ణాటకలో సీఎం మార్పు ప్రచారానికి Dy.CM డీకే శివకుమార్ తెరదించారు. అలాంటి మార్పేమీ ఉండదని స్పష్టం చేశారు. సీఎం సిద్ధరామయ్య ఐదేళ్లు పూర్తిగా పనిచేస్తారని, అందుకు తానూ సహకరిస్తానన్నారు. తామిద్దరం హైకమాండ్ ఆదేశాలను పాటిస్తామన్నారు. ‘అందరికీ మంత్రిపదవి అవకాశం రావాలని సీఎం యోచిస్తున్నారు. అందుకే క్యాబినెట్లో మార్పులు చేయాలనుకుంటున్నారు. ఈక్రమంలోనే పార్టీ MLAలు ఢిల్లీకి వచ్చారు’ అని తెలిపారు.


