News September 27, 2024

తిరుపతిలో జగన్‌పై దాడికి కుట్ర: YCP

image

AP: తిరుపతిలో మాజీ CM జగన్‌పై దాడికి కూటమి కుట్ర పన్నుతోందని YCP ఆరోపించింది. ‘BJP నేత భానుప్రకాశ్ రెడ్డి, జనసేన నేత కిరణ్ రాయల్, TDP నేతలు డబ్బులిచ్చి గూండాలని పురిగొల్పుతున్నట్లు సమాచారం. జగన్ వాహన శ్రేణిపై గుడ్లు వేసేందుకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో మనుషుల్ని పురమాయించినట్లు తెలుస్తోంది. జగన్ తిరుమల పర్యటనతో లడ్డూ ఇష్యూలో నీ బండారం బయటపడుతుందని భయపడుతున్నావా చంద్రబాబు?’ అని YCP ట్వీట్ చేసింది.

Similar News

News December 3, 2025

APPSC పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల

image

APPSC ఈ క్యాలెండర్ ఇయర్‌లో విడుదల చేసిన 21 ఉద్యోగ నోటిఫికేషన్లకు పరీక్ష తేదీలను <>ప్రకటించింది<<>>. రాతపరీక్షలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరుగుతాయి. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ (పేపర్-1) పరీక్ష జనవరి 27, 31, ఫిబ్రవరి 9, 11, 12 తేదీల్లో, సంబంధిత సబ్జెక్టు పేపర్ల పరీక్షలు జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు నిర్వహించనున్నారు. విశాఖ, తూ.గో., NTR, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పరీక్షలు జరగనున్నాయి.

News December 3, 2025

టెన్త్ అర్హతతో 362 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

image

ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో 362 మల్టీ టాస్కింగ్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. టెన్త్ అర్హతగల అభ్యర్థులు ఈనెల 14వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్స్( టైర్ 1, టైర్ 2) ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.18,000-రూ.56,900 చెల్లిస్తారు. వెబ్‌సైట్: mha.gov.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News December 3, 2025

HALలో అప్రెంటిస్ పోస్టులు

image

HAL గ్రాడ్యుయేట్, డిప్లొమా, ట్రేడ్(EX-ITI) అప్రెంటిస్‌లను భర్తీ చేయనుంది. ఇంజినీరింగ్, డిప్లొమా ఉత్తీర్ణులు www.mhrdnats.gov.in పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. డిప్లొమా విద్యార్థులను ఈనెల 8 -13వరకు, ఇంజినీరింగ్ అభ్యర్థులను ఈనెల 17-20 తేదీల్లో ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు. EX ITI అభ్యర్థులు NAPS అప్రెంటిస్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని, దరఖాస్తును ఈ నెల 15లోగా పంపాలి. hal-india.co.in