News September 11, 2024
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తీసుకొచ్చే కుట్ర: మంత్రి రాంప్రసాద్ రెడ్డి

AP: ప్రకాశం బ్యారేజీ కౌంటర్ వెయిట్లను ఢీకొట్టిన బోట్లు YCP నేతలకు చెందినవేనని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. బ్యారేజీని కూల్చివేసి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తీసుకురావాలనే కుట్రతోనే బోట్లను ఢీకొట్టేలా చేశారన్నారు. ప్రజాప్రతినిధిగా జగన్ వ్యవహరించట్లేదని దుయ్యబట్టారు. మాజీ ఎంపీ కోసం జైలుకు వెళ్లి పరామర్శించిన జగన్ వరదలతో కష్టాలు అనుభవిస్తున్న ప్రజల బాధలు పట్టావా అని మండిపడ్డారు.
Similar News
News October 19, 2025
UKలో ఉండటంపై విరాట్ ఏమన్నారంటే?

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కొన్ని నెలలుగా ఫ్యామిలీతో కలిసి UKలో ఉంటున్న విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ్టి మ్యాచ్కు ముందు ఆయన స్పందించారు. ‘టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత నాకు చాలా సమయం దొరికింది. జీవితంలో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు కుటుంబంతో కొంత సమయం గడపగలుగుతున్నా. ఇది ఒక అందమైన దశ. చాలా ఆనందంగా ఉన్నా. ఫ్రెష్గా, ఫిట్గా ఫీల్ అవుతున్నా’ అని చెప్పారు.
News October 19, 2025
గత ప్రభుత్వంలో ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లలో దొరికేవి: CM

TG: గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వలేదని, ఇచ్చినా పరీక్షలు పెట్టలేదని సీఎం రేవంత్ విమర్శించారు. HYDలో సర్వేయర్లకు సీఎం లైసెన్సులు అందజేశారు. ‘గత ప్రభుత్వం పోటీ పరీక్షలు పెట్టినా ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లలో దొరికేవి. TGPSC పునరావాస కేంద్రంగా ఉండేది. మేము రాగానే దాన్ని ప్రక్షాళన చేశాం. ఏడాదిలోనే 60వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. కోర్టుల్లో పోరాడి అభ్యర్థులకు నియామకపత్రాలు అందజేశాం’ అని తెలిపారు.
News October 19, 2025
JEE మెయిన్-2026 షెడ్యూల్ వచ్చేసింది

JEE MAIN-2026 <