News April 16, 2025

బెంగాల్‌ను అప్రతిష్ఠపాలు చేసే కుట్ర: మమత

image

బెంగాల్‌ను భ్రష్టు పట్టించేందుకు కేంద్రం మీడియాను వాడుతోందని CM మమతా బెనర్జీ ఆరోపించారు. కొన్ని మీడియా సంస్థలను మోదీ పోషిస్తున్నారని విమర్శించారు. UP, కర్ణాటక, బిహార్‌, రాజస్థాన్‌కు చెందిన వీడియోలతో బెంగాల్‌ను అప్రతిష్ఠపాలు చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు. యువతకు ఎన్ని ఉద్యోగాలొచ్చాయి?, పెరిగిన పెట్రోల్, డీజిల్, మెడిసిన్స్ ధరల గురించి మాట్లాడాలంటూ సవాల్ చేశారు.

Similar News

News November 20, 2025

ఎక్స్‌ట్రీమ్‌ వెదర్‌తో 4,064 మంది మృతి

image

దేశంలో ప్రకృతి వైపరీత్యాలతో ఈ ఏడాది JAN-SEP వరకు 4,064 మంది మృత్యువాత పడినట్లు ఢిల్లీకి చెందిన ‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్మెంట్’ & ‘డౌన్‌ టు ఎర్త్‌’ నివేదిక వెల్లడించింది. గత 4 ఏళ్లతో పోలిస్తే మరణాలు 48% పెరిగినట్లు పేర్కొంది. 9.47 M హెక్టార్ల పంట నష్టం వాటిల్లింది. 2022తో పోలిస్తే 4 రెట్లు పెరిగింది. వ్యవసాయ రాష్ట్రాలైన AP, WBల సమాచారం అసమగ్రంగా ఉందని, నష్టం ఇంకా ఎక్కువే ఉండొచ్చంది.

News November 20, 2025

ఇజ్రాయెల్ దాడిలో 27 మంది మృతి

image

ఇజ్రాయెల్-హమాస్ మధ్య పదే పదే సీజ్ ఫైర్ ఉల్లంఘన జరుగుతోంది. నిన్న ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 27 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. గాజాలో 14 మంది, ఖాన్ యూనిస్ ఏరియాలో 13 మంది మరణించినట్లు వెల్లడించారు. హమాస్ సీజ్ ఫైర్ ఉల్లంఘనకు పాల్పడటంతోనే దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ చెబుతోంది. పరిస్థితులు మెరుగవుతున్న సమయంలో మరోసారి దాడులు ఆందోళనకు గురి చేస్తున్నాయని గాజా స్థానికులు చెబుతున్నారు.

News November 20, 2025

KTRకు బిగ్ షాక్.. విచారణకు గవర్నర్ అనుమతి

image

TG: మాజీ మంత్రి కేటీఆర్‌కు బిగ్ షాక్ తగిలింది. ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో ఛార్జ్‌షీట్ వేసేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. నిధుల దుర్వినియోగంపై విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఏసీబీ త్వరలో KTRపై అభియోగాలు నమోదు చేయనుంది. కాగా కొన్నిరోజుల క్రితం విచారణకు అనుమతి కోరుతూ ప్రభుత్వం గవర్నర్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ కేసులో A-1గా కేటీఆర్, A-2గా అరవింద్ కుమార్ ఉన్నారు.