News May 3, 2024
HYDను ఉమ్మడి రాజధానిగా పొడిగించేందుకు కుట్ర: హరీశ్ రావు

TG: హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా పొడిగించేందుకు కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు పేర్కొన్నారు. ఇందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ‘రాష్ట్రంలో హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైంది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని మాట తప్పింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలి. BRS అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలి’ అని ఆయన విజ్ఞప్తి చేశారు.
Similar News
News January 11, 2026
NZB: అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం: CP

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పేకాట, కోడిపందెలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని CP సాయి చైతన్య హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు.
News January 11, 2026
హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్లో అప్రెంటిస్ పోస్టులు

హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్(<
News January 11, 2026
చర్మానికి స్క్రబ్ ఎందుకు చెయ్యాలంటే?

పని ఒత్తిడిలో పడి చాలామంది చర్మ ఆరోగ్యాన్ని పట్టించుకోరు. దీంతో మృతకణాలు చేరి చర్మం నిర్జీవంగా మారుతుంది. అందుకే వీలు దొరికినప్పుడు శరీరం మొత్తానికి అంటే వీపు, మెడ, కాళ్లకు స్క్రబ్బింగ్ చేస్తే మంచిదంటున్నారు నిపుణులు. దీనికోసం బాత్సాల్ట్, డీప్ క్లెన్సింగ్ మిల్క్ వాడొచ్చు. లేదంటే గులాబీరేకల ముద్దలో తేనె, పాలు, ఉలవపిండి కలిపి చర్మానికి పట్టించి స్క్రబ్ చెయ్యాలి. దీనివల్ల చర్మ రంధ్రాలు శుభ్రపడతాయి.


